Ten paisa investment is 80 crores profit

ten paisa investment is 80 crores profit, TDP Party, Payyavulu Kesav, Ambati Rambabu, congress Party, Bhiviteja Enterprises, Banks

ten paisa investment is 80 crores profit

tdp.gif

Posted: 01/14/2012 12:07 PM IST
Ten paisa investment is 80 crores profit

ఏపీఐఐసీ అడ్డగోలు భూకేటాయింపుల కారణంగా రూపాయి పెట్టుబడి లేకుండా భువితేజా ఎంటర్ ప్రైజస్ సంస్థ రూ. 80 కోట్లు సంపాదించుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అప్పట్లో ఏపీఐఐసీకి ఛైర్మన్ గా వ్యవహరించిన అంబటి రాంబాబుకూ ఇందులో భాధ్యత ఉంటుందని పేర్కొంది. తాను సంతకం పెట్టలేదంటూ ఆయన తప్పించుకునే యత్నం చేస్తున్నారని, మరి ఆయన కాకుంటే బాధ్యులెవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేసింది. భువితేజకు చేసిన కేటాయింపును రద్దు చేసి ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలని డిమాండ్ చేసింది.

గచ్చిబౌలి ప్రాంతంలోని ఏపీఐఐసీ ఆర్థిక జిల్లాలో తమకు పెట్రోల్ బంకు కోసం ఎకరం స్థలం కేటాయించాలంటూ భూవితేజ ఎంటర్ ప్రైజస్ పేరుతో కేవలం 10 పైసల ఖర్చుతో 22.10.2002 లో ఒక దరఖాస్తూ పెట్టుకున్నారు. అంతే.. అన్నీ చకచకా సాగిపోయాయి. 48 గంటల వ్యవధిలోనే రూ. 25 కోట్ల విలువైన బూమిని కేవలం 1.14 కోట్లకు ఇచ్చేశారు. భూమి కేటాయించాక 9.11.2005న ఆ సంస్థ రిజిష్టరు చేయించారంటే ఇదంతా ఎంత పథకం ప్రకారం సాగిందో అర్థమవుతుందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

అంతేకాదు ఏపీఐఐసీ ఇచ్చిన ఆ భూ కేటాయింపు లేఖను చూపించి యూకో బ్యాంకు నుండి రూ. 1.5 కోట్ల రుణం ఆ సంస్థ పేరుతో తీసుకుని ఆ డబ్బు ప్రభుత్వానికి కట్టేశారు. తర్వాత ఆ స్థలాన్ని దక్షిణ్ ఎంటర్ ప్రైజెస్ కు   అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడక్కడ రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా 17 అంతస్తులు భారీ భవంతిని నిర్మిస్తున్నారు. అందులో 80 వేల చదరపు అడుగులు భూవితేజకు ఇవ్వాలంటూ ఒప్పందం రాసుకున్నారు. ఈ ఒప్పందాన్ని చూపించి బ్యాంకు నుంచి మళ్లీ రుణం తీసుకన్నారు. చదరపు అడుగు ధర రూ. 5 వేలుగా చూపించారు. ఆ లెక్కన ఈ కంపెనీకొచ్చే నిర్మిత స్థలం విలువ రూ. 80 కోట్లు . అంటే రూపాయి పెట్టుబడి లేకుండా 80 కోట్లు సంపాదించారు అంటూ పయ్యావులు కేశవ్ అసలు గుట్టు విప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One lakh jobs cm kiran kumar reddy
Ia pilots go on enmass sick leave as part of no pay no work  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles