Indian court threatens to block google facebook

Indian court threatens to block Google, Facebook, The Delhi High Court on Thursday warned social networking site Facebook India and search engine Google

Indian court threatens to block Google, Facebook, The Delhi High Court on Thursday warned social networking site Facebook India and search engine Google

Delhi High Court.gif

Posted: 01/13/2012 02:12 PM IST
Indian court threatens to block google facebook

సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్ ఇండియా, సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇండియాకు పరుష హెచ్చరికలనూ జారీచేసింది. వెబ్ పేజీల్లో అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని నిరోధించే ప్రత్యేక ఏర్పాటు చేయని పక్షంలో చర్యలు తథ్యమని గురువారం స్పష్టం చేసింది. చైనా తరహాలో వెబ్‌సైట్లను బ్లాక్ చేసేందుకు కూడా వెనుకాడేది లేదని జస్టిస్ సురేశ్ కైత్ పేర్కొన్నారు. అభ్యంతరకర సమాచారాన్ని తొలగించే, నిరోధించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ రెండు వెబ్‌సైట్లపై మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జరగనున్న విచారణపై స్టే ఇవ్వడానికి జడ్జి నిరాకరించారు. అభ్యంతరకర సమాచారాన్ని నియంత్రించడం కానీ, నిరోధించడం కానీ సాధ్యం కాదని గూగుల్ ఇండియా తరఫున వాదిస్తున్న మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహ్తగి చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పుంఖానుపుంఖాలుగా సమాచారాన్ని వెబ్‌సైట్లలోకి జొప్పిస్తుంటారు. వాటిలో అభ్యంతరకరమైనవీ ఉండొచ్చు. అశ్లీలమైనవీ ఉండొచ్చు. అంతే తప్ప వెబ్‌పేజీల్లోకి వచ్చే సమాచారంలో ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించలేం' అని వివరించారు. 'అమెరికాకు చెందిన గూగుల్ సంస్థే సర్వీస్ ప్రొవైడర్. మేం(గూగుల్ ఇండియా) కాము. యాజమాన్య సంస్థ చర్యలకు మేమెలా బాధ్యులమవుతాం' అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao to work as an attender in ntr trust bhavan
Health department war on polio successful  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles