మూడు, నాలుగు సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యాటకులను ఉల్లాసపరచటానికి స్థానిక జరావా మహిళల చేత అర్ధ నగ్నంగా నృత్యాలు చేయించిన వీడియో తతంగాన్ని లండన్ పత్రిక అబ్జర్వర్ బయటపెట్టటమే కాకుండా ఆ వీడియోని వెబ్ లో కూడా పెట్టటం సంచలనానికి దారితీసింది.
ఉపాధి లేని ప్రాంతాల్లోని గిరిజనులకు తినటానికి కావలసిన డబ్బులిస్తే చాలు వారు అర్ధనగ్నంగా నృత్యం చేస్తారని తెలుసుకుని కొందరు పర్యాటక సంస్థల వారు, ఏజెంట్లు ఎన్నో సంవత్సరాలుగా దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పర్యాటకులను ఆకర్షించటానికి ఇది చాలా తేలికైనది, తక్కువ ఖర్చుతో పోయేది కాబట్టి ఈ తంతు ఎప్పిటి నుంచో జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్టు ఉన్నారని తెలుస్తూనేవుంది. కానీ వీడియో ఫుటేజ్ తో సహా ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి పోలీసులు, అధికారులు నేరస్తులను పట్టుకోవటానికి హడావిడి చేస్తున్నారు. గిరిజన సంక్షేమ సంఘాలు ఫౌల్ అని అరుస్తున్నాయి.
ఆ వీడియో కాపీ మా దగ్గరకు వచ్చింది. దాన్ని పరిశోధించటానికి ల్యాబ్ కి పంపించాం. ఈ వీడియో, నేను మా చేతికొచ్చిన వీడియో గురించి మాట్లాడుతున్నా, ఇంకా ఎన్ని వీడియోలున్నాయో నాకు తెలియదు, ఈ వీడియో మాత్రం 3, 4 సంవత్సరాల క్రితం చిత్రీకరించిందని తేలింది అని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు.
ఈ వీడియో ఏ కంప్యూటర్ నుంచి హోస్ట్ అయిందో తెలుసుకోవటానికి పోలీసు బలగాలు సైబర్ విభాగం సాయం తీసుకుంటున్నాయి. గుర్తు తెలియని నిందితుల మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 292, ఐటి యాక్ట్ సెక్షన్ 67, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్ సెక్షన్ 3(2) కింద, ప్రొటెక్షన్ ఆఫ్ ఎబొరిజినల్ ట్రైబ్స్ యాక్ట్ సెక్షన్ 7, 8 కింద కేసులు నమోదు చేసారు.
పనిలో పనిగా సంక్షేమ సంఘాలన్నీ ఈ చర్యను ఖండిస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more