ఏనుగు విగ్రహాల మీద మాయావతి విగ్రహాల మీద ముసుగు వెయ్యమని ఆదేశించిన ఎన్నికల సంఘ నిర్ణయాన్ని ఉత్తర ప్రదేశ్ లోని బహజన సమాజ్ వాది పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మాయావతి తప్పు పట్టింది. రాజ్యాంగంలో 14 వ అధికరణలో కలిగించిన సమానత్వపు హక్కుని ఉల్లంఘించటమే అవుతుందని ఆవిడ అన్నారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణాయలు తగవని ఆ ఆదేశాన్ని పునపరిశీలించాలని మాయావతి ఎన్నికల కమిషనర్ కి లేఖ రాసారు. రాష్ట్రపతి భవన్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లలోనూ, పార్లమెంట్ లో స్పీకర్ కూర్చునే చోట కూడా ఏనుగు విగ్రహాలున్నాయని ఆవిడ గుర్తుచేసారు. అలాంటప్పడు మా ఏనుగు మీదనే ఎన్నికల అధికారికెందుకు అభ్యంతరమని ప్రశ్నిస్తూ, మరి ఇతర పార్టీల సైకిల్, కమలం, చేతి పంపు లాంటి వాటి సంగతేమిటని అడిగారు మాయావతి.
ఇది అనవసరమైన వాదనని ఆమెకి తెలిసే చేస్తున్నారో తెలియకనో కానీ, దీన్ని వితండవాదం అని అంటారు. ఎన్నికల గుర్తైన ఏనుగును ఉత్తర ప్రదేశ్ ప్రజల మనస్సులో గట్టిగా ముద్ర పడటం కోసమే మాయావతి ఏనుగు రాతి విగ్రహాలను, కాంస్య విగ్రహాలను, కోట్ల రూపాయల ఖర్చుతో భారీగా తయారుచేయించి పెట్టించారు. అలాగే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఇవి ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశముందని, దానివలన ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగినట్టవదని ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని తప్పు పట్టటానికేముంది?
సైకిల్ విగ్రహాలు కమలాల విగ్రహాలు, చేతి పంపు విగ్రహాలను భారీగా ప్రతిష్టిస్తే మరి వాటి సంగతేమిటని అడగవచ్చు. ఎన్నికలు జరగబోయేవి ఉత్తర ప్రదేశ్ అయినప్పుడు ఢిల్లీలోని పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ లోని ఏనుగు విగ్రహాలకేం సంబంధం?
అయితే రాజకీయాల్లో ఆరితేరిన మాయావతికి ఇవన్నీ తెలియవని అనుకోగూడదు. ఛోలీకే పీఛే క్యా హైఅన్నట్టు ఇప్పటికే ముసుగులు వేస్తున్నందువలన ఆ ముసుగుల అడుగున ఉన్నవేమిటో తెలుసు కాబట్టి అది ప్రచారాన్ని ఇంకా పెంచుతోంది. ఇప్పుడు దానిగురించి రభస చెయ్యటం వలన ఆ ప్రచారం ఇంకా ఇంకా పెరగిపోతుంది! కడప ఉప ఎన్నికల్లో కూడా వైయస్ ఆర్ విగ్రహాల మీద ముసుగులు వేయించారు ఇసి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more