మన పొరుగు దేశం గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. పాకిస్తాన్ లో జరగిన రాజకీయ అనిశ్చితి చూస్తుంటే ఆ దేశ పౌరుల మీద జాలి కలుగుతుంది, అటువంటి స్థితిని రానీయకుండా మొదటి రాజ్యాంగ పవిత్రతను కాపాడుతూ ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్న మన దేశ నాయకుల మీద గౌరవం కూడా పెరుగుతుంది. పాక్ అంటే మంచి, పవిత్రమైన అని అర్థం
భారత్ తోపాటే స్వతంత్ర్యదేశంగా 1947 లో రాజ్యాన్ని స్థాపించుకున్న పాకిస్తాన్ కి మొదటి గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నా.
1948 లో పాకిస్తాన్ ఏర్పడటానికి పాటుపడ్డ జిన్నా మృతిచెందారు. ఆ తర్వాత పాకిస్తాన్ పాలన అనిశ్చితిలో సాగింది.
1949 లో మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొడదామని మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ రావల్పిండిలో మద్దతుదారులతో చర్చలు జరిపి చేసిన ప్రయత్నం విఫలమైంది.
1951 లో లియాఖత్ అలీ ఖాన్ హత్యగావించబడ్డారు.
1956 లో పాకిస్తాన్ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు.
1958లో ప్రధానమంత్రి ఫిరోజ్ ఖాన్ నూన్ ని తొలగించిన రాష్ట్రపతి ఇస్కందర్ మిర్జా, కమాండర్ ఇన్ ఛీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ ని ఛీఫ్ మార్షల్ గా నియమించారు. ఇది జరిగిన 13 రోజుల్లోనే అయూబ్ ఖాన్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని మిర్జాని తొలగించారు.
1960 లో అయూబ్ ఖాన్ పాకిస్తాన్ రాజ్యాంగ పరిధిలో మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1965 లో జరిగిన ఎన్నికల్లో ఫాతిమా జిన్నాను ఓడించి అయూబ్ ఖాన్ రెండవ సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1969 లో అయూబ్ ఖాన్ రాజీనామాచెయ్యగా, యాహ్యా ఖాన్ సైనిక తిరుగుబాటుని ప్రకటించి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
1971 లో భారత్ తో యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ని వదులుకుని దానికి స్వతంత్ర్య ప్రతిపత్తిని కలిగించుకుని బంగ్లాదేశ్ గా రూపొందటానికి అవకాశమిచ్చింది. అదే సంవత్సరం యాహ్యా ఖాన్ రాజీనామా చేసారు.
1972 లో జుల్పికర్ అలీ భుట్టో అధ్యక్షులయ్యారు. ఈయన న్యూక్లియర్ అస్త్రాలను తయారు చేసుకుంటామని బహిరంగ ప్రకటన చేసారు.
1973 లో జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానమంత్రి అయ్యారు.
1977 లో అర్మీ ఛీఫ్ జనరల్ జియా ఉల్ హక్ సైనిక విప్లవాన్ని ప్రకటిస్తూ అప్పటివరకూ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న జుల్ఫ్ కార్ అలి భుట్టోని, ఆయన మంత్రులను, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ నేషనల్ ఎలియన్స్ రెండు పార్టీల నాయకులనూ నిర్బంధంలోకి తీసుకున్నారు.
1978 లో జియా ఉల్ హక్ ఆరవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసారు.
1979 లో జుల్ఫికార్ అలీ భుట్టో మీద వచ్చిన అమానుష చర్యల నేరారోపణలను కోర్టులో విచారణ చేసి ఆయనను ఉరితీసారు.
1980 లో మేజర్ జనరల్ తాజమ్ముల్ హుస్సేన్ మల్లిక్ పాకిస్తాన్ దినోత్సవం నాడు జియా ఉల్ హక్ ని హత్య చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు.
1985 లో సార్వత్రిక ఎన్నికలు జరిగి, ముహమ్మద్ ఖాన్ జునేజో ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
1988 లో జియా ఉల్ హక్ జునేజో ప్రభుత్వాన్ని రద్దు చేసారు. జుల్ఫకర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టో ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. జియా విమాన ప్రమాదంలో మరణించారు.
1990 లో అధ్యక్షుడు గులామ్ ఇషాక్ ఖాన్ బేనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేసారు. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు.
1993 లో రక్షక దళాల నుంచి వచ్చిన వత్తిడి వలన అధ్యక్షుడ గులామ్ ఇషాక్ ఖాన్, ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇద్దరూ రాజీనామాలు చేసారు. బేనజీర్ భుట్టో రెండవ సారి ప్రధానమంత్రి అయ్యారు.
1995 లో బేనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మస్లిం మతవాదుల మద్దతుతో ఆమె మీద విప్లవం చేద్దామని పూనుకున్న మేజర్ జనరల్ అబ్బాసి ప్రయత్నం విఫలమైంది.
1996 లో అధ్యక్షుడు ఫారూఖ్ లెఘరీ బేనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేసారు.
1997 లో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ రెండవసారి ప్రధానమంత్రి అయ్యారు.
1999 లో ఆర్మీ ఛీఫ్ జనరల్ కి విధేయుడైన అధికారిగా ఉన్న పర్వేజ్ ముషర్రఫ్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న నవాజ్ షరీఫ్ ని ఆయన మంత్రులను అరెస్ట్ చేసారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషర్రఫ్ ని తొలగిస్తూ, శ్రీలంక వెళ్ళి వస్తున్న అతన్ని విమానం నుంచి దిగకుండా చేద్దామని ప్రయత్నం చేసిన దరిమిలా పర్వేజ్ ముషర్రఫ్ ఈ చర్య తీసుకున్నారు.
2001 లో పర్వేజ్ ముషర్రఫ్ అధ్యక్షుడిని తొలగించి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
2002 లో 1999 నుంచి ఆగిపోయిన సార్వత్ర ఎన్నికలను నిర్వహించగా మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
2004 లో జమాలి రాజీనామా చేయగా, షౌకత్ అజీజ్ ప్రధానమంత్రి పదవినలంకరించారు.
2007 లో అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశ విదేశాల నుంచి వచ్చిన వత్తిడి ఫలితంగా దాన్నితొలగించారు. అదే సంవత్సరం మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు.
2008 లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ఎన్నికలు జరపాల్సివుండగా పర్వేజ్ ముషర్రఫ్ రాజీనామా చేసారు. అసిఫే అలి జర్దారీ కొత్త అధ్యక్షుడిగా వచ్చారు.
2009 లో పదవి లోంచి తొలగించబడ్డ పాకిస్తాన్ ఛీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ మొహమ్మద్ చౌదరి లాయర్ల ఆందోళనతో తిరిగి పదవిలోకి వచ్చారు.
2011 లో అబ్బోతాబాద్ లో విలాసవంతమైన నివాసంలో భార్యా పిల్లలతో తలచాచుకున్న ఒబామా బిన్ లాడెన్ అమెరికన్ దళాలచేత హత్య గావించబడ్డారు. అందుకు అసిఫ్ అలీ జర్దారీ అమెరికా ప్రభుత్వానికి మద్దతునిచ్చారన్న అభియోగంతో మిలిటరీ బృందంలో అసంతృప్తి మొదలైంది.
2012 జనవరి 12 న లో జర్దారీ చైనా పత్రికలలో ఇంటర్వ్యూలో మిలిటరీ ప్రధానులను విమర్శించారని తప్పు పడుతూ ఆర్మీ ఛీఫ్ అశ్ఫాక్ పర్వేజ్ కయానీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. కాకపోతే సైనిక తిరుగుబాటు ఉండకపోవచ్చని, సుప్రీం కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more