Darkness in the lives of slum dwellers at dawn

darkness in the lives of slum dwellers at dawn, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

dark-at-dawn-1.gif

Posted: 01/11/2012 01:13 PM IST
Darkness in the lives of slum dwellers at dawn

ఆదమరచి నిద్రపోతున్న గుడిసె వాసులు. ఉన్నట్టుండి వేకువనే జెసిబి లతో వచ్చి గుడిసెలను నేల మట్టం చేస్తుండటంతో పిల్లాపాపలతో చలిలో దిక్కు తోచని నిరుపేదలు. ఇదేమిటి అని అడిగి ఎదురొచ్చినవారిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించటం- ఇదేమీ సినిమాల్లో జరిగిన సన్నివేశం కాదు.

అది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం.  కోహెడా రెవిన్యూ పరిధిలో సర్వే నంబర్ 162 లో ప్రభుత్వ భూమి. దీనిలో 32 ఎకరాల భూమిని లోగడ హౌసింగ్ బోర్డ్ కి కేటాయించారు. కాగితం మీద కేటాయింపే కానీ ప్రత్యక్ష కార్యకలాపాలేమీ ఆ భూఖండంలో జరగలేదు. ఖాళీగా ఉన్న ఆ స్థలంలో వివిధ గ్రామాలకు చెందిన పేదలు అందులో గుడెసెలు వేసుకుని, విద్యుత్తు కూడా ఏర్పాటు చేసుకుని బోర్ నీళ్ళ సౌకర్యంతో జీవిస్తున్నారు. అయితే వారిని ఖాళీ చేయించటం కోసం. ఎటువంటి పూర్వ హెచ్చరికా లేకుండా అకస్మాత్తుగా సూర్యోదయానికి ముందే విరుచుకు పడ్డారు రెవిన్యూ అధికారులు.

ఈ దాడికోసం ముందే పకడ్బందీగా వ్యూహం పన్నారు రెవిన్యూ శాఖ సిబ్బంది. దగ్గరలోనే ఉన్న ఒక గార్డెన్ కి రాత్రే చేరుకుని, ఉదయం కోసం వేచి చూసి ఒక్కసారే పోలీసు సిబ్బంది, జెసిబిలతో గుడిసెల మీదదాడి చేసారు. చలిలో బయటకు వచ్చిన వారంతా చలితోనే కాకుండా భయంతో కూడా వణికిపోతున్నారు. నిలవనీడుంటేనే రోజులు గడిచేది కష్టంగా ఉన్న వారి బ్రతుకుల్లో కూలీనాలీ చేసుకోవటానికి పోవటానికైనా పిల్లా పాపలను ఎక్కడుంచాలి అన్నది చూసుకుని మరో సారి గూడు కట్టుకునేంత వరకూ సాధ్యపడదు. ముందుగా ఎటువంటి హెచ్చరికలూ సమాచారం లేకుండా గుడిసెల్లోంచి రోడ్డు మీదికి లాగటం సబబేనా అని వారంతా ఆవేదనగా అడుగుతున్నారు.

ఆవేదనలు, ఆక్రోశాలు, నిందలూ, శాపనార్థాలు, పిల్లల ఏడుపులు, హడావిడిగా తల తిప్పుతూ గుడిసెలను పెళ్ళగిస్తున్న జెసిబి శబ్దాలతో ఆ వాతావరణం నిండిపోయింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama pak hideout to be flattened by rockets
Cm araku visit cancelled due to bad weather  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles