ఉత్తర ప్రదేశ్ లో రానున్న ఎన్నికల సందర్బంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రంలోని ఏనుగు బొమ్మల మీద ముసుగులు వేయిస్తున్నారు. చేస్తున్న పని చట్టబద్ధమే కానీ ఆ చట్టం ముసుగులోనే ఆమె అనుకున్న పని కూడా నెరవేరుతోంది. బహుజన సమాజ్ వాదీ పార్టీకి మాయావతికి లభించిన ఎన్నికల చిహ్నం ఏనుగు. ఆమె ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలను ప్రతిష్టించారు. ఢిల్లీ సరిహద్దులో ఉన్న నోయిడాలోనైతే ఏకంగా 30 రాతి విగ్రహాలు, 22 కాంస్య విగ్రహాలు ఉన్నాయి. ఆ ఏనుగు మీద ఎన్నో వ్యాఖ్యలు కూడా వచ్చాయి. రాహుల్ గాంధీ తన ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వాటి మీద వ్యాఖ్యానాలు చేసారు. దానికి ప్రతిగా మాయావతి అప్పట్లో తగు సమాధానం ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇవన్నీ రాష్ట్ర ప్రజల మనసుల్లో ముద్ర పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిమీద గులాబీ రంగు పాలిథిన్ కవర్ వేస్తున్నారు. కానీ మనుషుల మనసుల్లో ప్రతిష్టించుకున్నదాని మీద ముసుగు ఎవరు వేయగలరు. వాటి మీద వాదోపవాదాలు మానసాలలో ఇంకా తాజాగానే ఉన్నాయి.
పైగా, ముసుగు వెయ్యటంతో ప్రత్యేకతను కూడా అవి సంతరించుకుంటాయి. జనాభా తిరుగుతున్న చోట ఒక మనిషి మొత్తం ముసుగు కప్పుకుని వస్తే అందరి దృష్టీ అతని మీదనే పడుతుంది. అలాగే ఈ ముసుగుల వలన అంతకు ముందు చూడని వారు కూడా అదేమిటని అడిగి మరీ తెలుసుకుంటారు.
ఈ విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తున్నట్టుగానే ఉన్నా మాయావతి తను అనుకున్నది చాలా బాగా సాధించారని చెప్పవచ్చు. పైగా ఇదంతా ప్రభుత్వం ఖర్చుతో. ఆ ముసుగుల ఖర్చు కోటి రూపాయలని అంచనా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more