Lover boys cruel acts

lover boys cruel acts, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

love-devil-1.gif

Posted: 01/05/2012 10:50 AM IST
Lover boys cruel acts

ప్రేమకు అర్థం చెప్పటం చాలా కష్టమని ఎప్పుడో తెలిసిపోయింది. అది ఎక్కడ పుడుతుందో, ఎందుకు పుడుతుందో తెలియదు కానీ, ఒకసారి ప్రేమంటూ మొదలైతే దాన్ని తీసివెయ్యటం చాలా కష్టమని మాత్రం అందరూ అంగీకరించారు. ప్రేమించిన వ్యక్తికి కావలసింది సమకూర్చటానికి ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ఉదంతాలెన్నో గతంలో వింటూ వచ్చాం. అయితే ఈ మధ్య కాలంలోని ప్రేమ అంకిత భావానికీ త్యాగానికీ హృదయం నిండిన ఆత్మ సంతృప్తికీ కాకుండా రాక్షసత్వానికి దారితీస్తోంది. ప్రేమించిన అమ్మాయికి ఏం కావాలో తెలుసుకోకుండా, తను ప్రేమించాడు కాబట్టి ఆ అమ్మాయీ అందుకు ప్రతిగా తనను ప్రేమించితీరాలన్న పట్టుదలను పెంచి అందుకు అంగీకారం తెలపని ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చెయ్యటం లాంటి పనులు ప్రేమ అనే పదానికే అర్థాన్ని మార్చేస్తున్నాయి!

ఈ రోజు వెలుగు చూసిన అటువంటి ఘాతుకమే కృష్ణా జిల్లాలో బంటుమిల్లి మండలం నాగన్న పేటలో సంభవించింది. పెళ్ళి చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్న ఒక యువకుడికి అంగీకారం తెలపలేదంతే. ఆ యువకుడు కోపంతో ఆ యువతిని కత్తితో దాడి చేసాడు. రక్తం కళ్ళ చూసిన తర్వాత కానీ వాస్తవంలోకి రాని ఆ యువకుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సరే కానీ ఇదేం ప్రేమ. దాన్ని ఎవరు శోధిస్తారు?

ప్రేమ కాదిది. ప్రేమ మనసులో ఆనందాన్ని నింపుతుంది. త్యాగానికి పురికొల్పుతుంది. ప్రేమించిన వారి సుఖం కోసం హృదయం తపిస్తుంది. ప్రాణాలర్పించైనా ప్రేయసిని ఆనందింపజేయాలని ఉంటుంది. అయితే, ఆధునిక ప్రేమలో కూడా త్యాగం ఉంది. కానీ అది ఎదుటివారిలో కోరుకోవటం, ప్రాణాలు పోయినా పరవాలేదు అని ఎదుటివారి విషయంలో అనుకోవటం జరుగుతోంది. పోనీ భాషలో దీనికే వేరే పేరయినా పెట్టుకుందాం, లేకపోతే ప్రేమ అనే పదం వింటేనే భయపడే రోజులు వస్తాయి. "భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు" అని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆదుర్దా పడే రోజులు చూస్తాం! "నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నా" అంటే తండ్రి ముందు లాయర్లను సంప్రదించవలసిన రోజులు వచ్చేస్తాయి!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire broke in cargo section of delhi airport
Election notification released for manipure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles