Cong attacks hazarecalls him rss agent

news, hindustantimes, Anna Hazare, Lokpal, Digvijaya, Beni Prasad Verma, RSS

A picture of anti-corruption campaigner Anna Hazare with RSS leader Nanaji Deshmukh published in a Hindi daily on Sunday prompted the Congress to launch a scathing attack on Hazare and dub him an “RSS agent”. Congress has lost its mind

Cong attacks Hazare_calls him RSS agent.GIF

Posted: 12/26/2011 10:57 AM IST
Cong attacks hazarecalls him rss agent

Anna-Hazareఅవినీతి పై పోరాటం చేస్తున్న హన్నా హజారేకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య రోజురోజుకి మాటల యుద్దం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి మరో తీవ్రమైన విమర్శను అన్నా పై విసిరారు. హజారేను ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌’ అని, ఆయనను సైన్యం నుంచి తొలగించారని దిగ్విజయ్‌సింగ్‌ ఆదివారం ఆరోపించారు. ఈ నెల 27 నుంచి మూడు రోజులు హజారే నిరాహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఈ తాజా వివాదానికి ఆదివారం అంకురార్పణ జరిగింది. హజారేపై ఎప్పుడూ కత్తులు దూసే దిగ్విజయ్‌ మరోసారి ధ్వజమెత్తారు.హజారే ఒకానొకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌కు కార్యదర్శిగా పనిచేశారన్నారు. ‘నానాజీకి కార్యదర్శిగా పనిచేయడమే కాక, 1983లో గోండాలో సంఘ్‌ కార్యకలాపాల్లో శిక్షణ పొందారు. ఆదివారం నాటి దునియా పత్రిక మొదటి పేజీలో చూస్తే ఇది తెలుస్తుంది’ అని దిగ్విజయ్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్వీటర్‌లో తెలిపారు.

హజారేపై వచ్చిన విమర్శల్ని అన్నా బృందం సభ్యుడు అర్వింద్‌ కేజ్రీవాల్‌ తిప్పికొట్టారు. ‘హజారే సంఘ్‌ ఏజెంట్‌ కాదు, జాతికే ఏజెంట్‌’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ కూడా దిగ్విజయ్‌ ట్విటర్‌లో హజారేపై చేసిన ఆరోపణ పట్ల వెంటనే స్పందించారు. ‘ఒకే వేదికపై ఉన్నంత మాత్రాన ఒకరు మరొకరి ఏజెంట్‌ అవుతారా? అయితే వచ్చేసారి ఒక్కరే కూచోవాలా?’ అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Russia allotts land to iskan for krishna temple
Power charges hiked in ap state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles