Bhagavad gita faces extremist branding ban in russia

Bhagavad Gita, one of the holiest Hindu scriptures, is facing a legal ban and the prospect of being branded as ''an extremist'' literature across Russia. A court in Siberia's Tomsk city is set to deliver its final verdict Monday in a case filed by state prosecutors.

Bhagavad Gita, one of the holiest Hindu scriptures, is facing a legal ban and the prospect of being branded as ''an extremist'' literature across Russia. A court in Siberia's Tomsk city is set to deliver its final verdict Monday in a case filed by state prosecutors.

Bhagavad Gita ban in Russia.GIF

Posted: 12/18/2011 11:49 AM IST
Bhagavad gita faces extremist branding ban in russia

Bhagavth-geeta‘‘కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది. దాని ఫలితాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడమూ మానద్దు. ’’ భగవద్గీతలోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలోని శ్లోకమిది. దీంతోపాటు అనేకానేక శ్లోకాలతో మానవజీవితానికి మార్గదర్శకత్వం వహిస్తుందీ మహాగ్రంథం. కానీ, రష్యాలో మాత్రం న్యాయమూర్తులకు అదో 'ఉగ్రవాద' సాహిత్యంలా కనపడింది. ఒకప్పుడు కమ్యూనిస్టు సాహిత్యాన్ని దగ్గర పెట్టుకుంటే తీవ్రవాదులని భావించి అరెస్టుచేసేవారు. కానీ, కమ్యూనిస్టు దేశమైన రష్యాలో పవిత్ర భగవద్గీతే వారికి ఉగ్రవాద భూతంలా కనిపించింది. అందుకే.. సైబీరియాలోని టామ్స్క్ నగరంలోని కోర్టు ఈ గ్రంథాన్ని నిషేధించాలని తలపోస్తోంది. ఆ రాష్ట్ర న్యాయవాదులు ఈ విషయమై దాఖలు చేసిన కేసులో తన తుది తీర్పును సోమవారం వెలువరించనుంది.

దీనిపై దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని రష్యాలోని భారతీయులు, ఇస్కాన్ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ గ్రంథం సాంఘిక విభేదాలను ప్రచారం చేస్తున్నందున రష్యాలో దీని అమ్మకాన్ని అక్రమంగా ప్రకటించాలని న్యాయవాదులు కోరారు. దాంతో మాస్కోలో స్థిరపడిన 15వేల మంది భారతీయులతో పాటు ఇస్కాన్ ప్రతినిధులు కూడా మన్మోహన్ సర్కారు ఈ విషయమై దౌత్యపరంగా కలగజేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు వారు ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశారు. రష్యాలోని హిందువుల హక్కులను సంరక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించాలని తాము కోరుతున్నట్లు ఇస్కాన్‌కు చెందిన సాధుప్రియ దాస్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Enforcement directorate notices to ys jagan
Veena malik missing since 48 hrs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles