Congress mlas hurl chair in odisha assembly

Congress MLAs hurl chair in Odisha Assembly,Chaos in Assemblies, Odisha assembly,Opposition members created unruly scenes in the Odisha assembly,BJD MLA

Congress MLAs hurl chair in Odisha Assembly

Congress MLAs.GIF

Posted: 12/13/2011 01:43 PM IST
Congress mlas hurl chair in odisha assembly

Congress MLAs hurl chair in Odisha Assembly

ఒడిషా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెసు సభ్యులు వీరంగం వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ అసభ్యంగా, అవాంఛనీయంగా ప్రవర్తించారు. ఈ సమయంలో ఒక సభ్యుడు కుర్చీ ఎత్తి స్పీకర్‌ పోడియంలోకి విసిరేసే ప్రయత్నం చేశారు. సభ అదపు తప్పడంతో స్పీకర్‌ ప్రదీప్‌ అమత్‌ రెండుసార్లు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లి శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో ఓ కాంగ్రెసు సభ్యుడు విలేకరుల టేబుల్‌ వద్ద ఒక కుర్చీని ఎత్తి స్పీకర్‌ పోడియంలోకి విసిరే ప్రయత్నం చేశారు. అయితే ఆ కుర్చీని అసెంబ్లీ సిబ్బంది లాక్కున్నారు. దీంతో స్పీకర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. దీంతో స్పీకర్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తరువాత సభ సమావేశమైనా గొడవ తగ్గకపోవడంతో మళ్లీ సాయంత్రం మూడు గంటల వరకు వాయిదా వేశారు. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు జరగనున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After four years in jail is amanda knox about to walk free
Supreme court advises keral to maintain restraint  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles