Chief minister mr n kiran kumar reddy

Chief Minister Mr N Kiran Kumar Reddy , Chittoor district, Kiran Kumar Reddy, Nallari Kiran Kumar Reddy, Speaker of the Andhra Pradesh legislative assembly, takes charge as the chief minister,

Chief Minister Mr N Kiran Kumar Reddy

Chief Minister Mr N Kiran Kumar Reddy.GIF

Posted: 12/13/2011 01:37 PM IST
Chief minister mr n kiran kumar reddy

Chief Minister Mr N Kiran Kumar Reddy

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడంతో రాష్ట్రంలో మరో ముఖ్యమైన ఘట్టానికి తెరలేవబోతున్నది. అయితే విప్ కోండ్రు మురళి మోహన్ స్పీకర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇది వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడుకోవడానికి చేస్తున్న యత్నమా? లేక నిజంగానే వేటు వేస్తారా? అన్నది కూడా తెరపై చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఓ అర డజను మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు సమర్పించిన పిటిషన్ పై నిర్ణయం జరగలేదు.కొన్ని నెలల క్రితం నుంచి ఈ డ్రామా నడుస్తోంది.ఇప్పుడు సరికొత్త డ్రామా సృష్టించకుండా నిజంగానే ఓ వారం , పది రోజులలో ఈ తతంగాన్ని కాంగ్రెస్ పార్టీ , స్పీకర్ నాదెండ్ల మనోహర్ పూర్తి చేస్తే అప్పుడు రాష్ట్రంలో మిని సాధారణ ఎన్నికలు జరుగుతాయి.

ఇరవై నాలుగు ఉప ఎన్నికలు అంటే తక్కువ సంఖ్య కాదు.గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదహారు మంది రాజీనామా చేసినప్పుడు అప్పటికే ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలతో సహా పద్దెనిమిది ఉప ఎన్నికలు జరిగితే రాజకీయంగా సందడి ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉప ఎన్నికలు, అది కూడా ఒక విశేషమైన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో జరిగే ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అవి అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంటుంది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు అవుతాయి. అదే సమయంలో టిడిపి కి ఒక రాజకీయంగా పెద్ద అవకాశం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijaya asks for highcourt change
Parliament attack incident is 10 year old  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles