Land records of rajasthan

Land Records of Rajasthan, Natural resources in India,Oil and Natural Gas Corporation, villages of Barmer, 2005 single Hotel, Inter net cafe, dubai, vehicals, Tvs, 750 members vips Banks, Water, 17000 land

Land Records of Rajasthan

Land Records of Rajasthan.GIF

Posted: 12/12/2011 07:01 PM IST
Land records of rajasthan

Land Records of Rajasthan

కెయిర్న్‌ ఇండియా ఇక్కడ చమురు నిల్వలు కనుగొనక ముందు భూమి విలువ ఎకరా 10వేలు వుండేది. . కెయిర్న్‌ ఇండియా తన చమురు క్షేత్రాల కోసం 3000 ఎకరాలను సేకరించింది. అక్కడ పలుచోట్ల డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్నది. రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో కెయిర్న్‌ ఇండియా, జెఎస్‌ డబ్ల్యూ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంతో విస్తారంగా భూమిని సేకరిస్తున్నాయి. కెయిర్న్‌ ఇండియా తన ప్రాజెక్టు కోసం మూడువేల ఎకరాలను సేకరించింది.. ప్రస్తుతం అది నాలుగు లక్షలకు పెరిగింది. జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఎకరాకు ఏడు లక్షలు చెల్లించి 17వేల ఎకరాలను సేకరిం చింది.  ఈ కంపెనీలు 750 మంది కోటీశ్వరులున్నారు. కానీ వీరిలో చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవు. చదువు, సంద్యలు లేవు. వారికి మంచినీరు కానీ, విద్యుత్‌ కానీ అందుబాటులో లేవు. సమీపంలో జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ 1080 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటును నెలకొల్పు తున్నది. దీనికోసం 17000 ఎకరాల భూమిని సేకరించింది.

 ఒక్కో ఎకరాకు ఏడు లక్షలు చెల్లించానని అంటున్నది. హఠాత్తుగా సంపన్నులైన ఈ పేదరైతులు బర్మైర్‌ ఇతర పట్టణాలలో స్థిరనివాసం ఏర్పరచుకుంటు న్నారు. కొంతమంది భూమి కోల్పోయినవారు చౌక ధరకు భూమి దొరుకుతుందా అని వెతుకు తున్నారు. మరికొందరు విలాసమైన వాహనాల ను, టీవీలను, ఎయిర్‌ కండీషనర్లను, రిఫ్రిజరేట ర్లను, వాషింగ్‌ మెషీన్లను కొంటున్నారు. వినోద పర్యటనలకు వెళుతున్నారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా రాజస్థాన్‌ బొలేరోలా అమ్మకంలో నాలుగో స్థానంలో వున్నట్లు చెప్తోంది. ఈ కంపెనీ మొట్టమొదట బర్మైర్‌లో తన డీలరు షిప్పును ఏర్పాటు చేసింది. గత మూడు సంవత్సరాలలో కార్ల రిజిస్ట్రేషన్‌ 766 నుంచి 1423కు పెరిగాయి. వీటిలో ఎక్కువగా బొలేరో, స్కార్పియో, ఇన్నోవా ఉన్నాయి. ఈ భూమిలో లిగ్నైట్‌ ఖనిజాన్ని వెలికితీస్తున్నది. ఈ కంపెనీ తాను రైతుల చేతుల్లో వెయ్యికోట్లు పెట్టినట్లు చెప్తోంది

ఇప్పుడు వాటి సంఖ్య 20కి పెరిగింది. మరికొన్ని నిర్మా  ణంలో వున్నాయి. బర్మైర్‌ చేరువలో రిసార్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు. కెయిర్న్‌ ఇండియా డ్రిల్లింగ్‌ ఆపరేషన్‌ సందర్భంగా లార్సన్‌ అండ్‌ టూబ్రోకు చెందిన 15వేల కార్మికులు ఇక్కడ పనిచేసేవారు. కొందరు హర్యా నా, ఢిల్లీ, అహ్మదాబాద్‌ వెళ్లి వాహనాలు కొను గోలు చేస్తున్నారు. అదే రోజు నేరుగా నగదు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బ్యాంకులు తమ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి.

2005లో బర్మైర్‌ లో ఒక్క హోటలు మాత్రమే వుండేది. ఆ సమయంలో హోటళ్ళకు మంచి గిరాకీ వుండేది. ప్రస్తుతం ఇక్కడ రిఫైనరీ ఏర్పాటు చేసే ప్రతిపాదన వుంది. అయితే పట్టణంలో మౌలిక సౌకర్యాల కొరత చాలా ఎక్కువగా వుంది. కెయిర్న్‌ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు అయిదుకోట్ల రాయల్టీ సెస్‌ రూపంలో వసూలు అవుతున్నది. కానీ ఈ ప్రాంతంలో మౌలిక సౌకార్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బర్మేర్‌ టౌన్‌లో పార్కులు లేవు. ఒకటే ఇంటర్‌  నెట్‌ కేఫ్‌ వుంది. రెస్టారెంట్లు లేవు. కానీ విదేశీ మద్యం మాత్రం అందుబాటులో వుంది.ఈ ప్రాం తంలో చమురు లభించినప్పుడు ఇది దుబాయి ప్రాంతంలా అభివృద్ధి చెందుతుందని ఆశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma files petition in supreme court
Pci chairman wants more powers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles