Chandrababu naidu sentiment by election

chandrababu naidu sentiment by election, Botsa Satyanarayana,YS Jagan, Chandrababu Naidu, No Confidence Motion, Jagan Mohan Reddy, N Kiran Kumar Reddy, MLAs supporting Jagan Mohan Reddy, crocodile tears, by-election,TRs party, Telangana issue, Telanganal sentiment,yst sentiment,

chandrababu naidu sentiment by election

chandrababu.GIF

Posted: 12/12/2011 03:42 PM IST
Chandrababu naidu sentiment by election

handrababu Naidu No Confidence

 తెలంగాణ, రాయలసీమ, కోస్తా.. మూడు ప్రాంతాల్లో 25 నియోజక వర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని, మూడు కోణాల్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రాతిపదికన జరిగితేనే టిడిపికి మేలు జరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయన్నది టిడిపి అంచనా. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ పని చేస్తుందని, ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. టిఆర్‌ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. అదే అంశం ఎన్నికల్లో ప్రాధాన్యత వహిస్తే అది టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుంది. ఇక వైఎస్సార్‌పై ఉన్న సానుభూతి ప్రధాన అంశంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికలు ఈ కోణంలోనే జరిగాయి. టిడిపి ప్రధానంగా అవినీతిపై విస్తృతంగా ప్రచారం సాగించినా, అది పని చేయలేదు. వైఎస్సార్ సానుభూతి ఎన్నికల్లో పని చేసింది.

ఉప ఎన్నికలను వైఎస్సార్ పేరు మీదనే ఎదుర్కోవాలని జగన్ కోరుకుంటున్నారు. జగన్‌తోపాటు వైఎస్సార్ సతీమణి విజయమ్మ కూడా ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తే సానుభూతి ప్రభావం ఉంటుందని ఇతర పార్టీల నేతలు సైతం భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్, వైఎస్సార్ సెంటిమెంట్ రెండూ ఉప ఎన్నికల్లో తెదేపాకు వ్యతిరేకంగా పని చేసేవే. ఇవికాకుండా అభ్యర్థులు ఎవరు? అనేది ప్రధానమైతే ఉప ఎన్నికల్లో మా ప్రభావం బాగానే ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారు. అభ్యర్థులే ప్రధానం అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఓడిపోతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులే ప్రధానం అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని, ఈ పోటీ తమకు మేలే చేస్తుందని టిడిపి నేతల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pci chairman wants more powers
Happy birthday superstar rajanikant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles