మన రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను చూసే గులామ్ నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణను రమ్మని పిలవగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపాలనేమో కానీ ప్రతి అంశానికీ ఢిల్లీ వెళ్ళి రావటం రాష్ట్ర నాయకులకు మొదట్లో తప్పని సరి అయి, ఇప్పుడు అలవాటయింది. ఇదే బావుంది. సొంత నిర్ణయం తీసుకుని తర్వాత ఇలా ఎందుకయింది, మీరేం చేస్తున్నారు లాంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి రాకుండా ముందే ప్రతి విషయమూ ఢిల్లీలో చర్చిస్తే గొడవలేని పని. పాలన అంటే పార్టీని బలోపేతం చేసుకోవటం, గద్దెను కాపాడుకోవటం వరకే పరిమితమైనట్టుగా ఉంది.
తాజా పరిణామాల మీద ముఖాముఖి మాట్లాడి, పార్టీలో వెన్నుపోటు సభ్యుల మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న సంగతి చర్చించుకోవటానికే ఈ భేటీ. అవిశ్వాస తీర్మానం మొదలైన ఈ మధ్య జరిగిన పరిణామాల మీద, పార్టీలో కలిసివచ్చేవారు, ఎదురు తిరిగేవారు, తప్పించుకునేవారు, ఇలా అందరి సభ్యుల గురించీ నివేదికలు ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరుతుంటాయి. వాటిని ముఖ్యమంత్రి, బొత్సా విడివిడిగా ఆజాద్ కి నివేదికలను అందించారు. వాటి మీద చర్చించి సముతిచ చర్యలు తీసుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు వారిద్దరితో ఆజాద్ భేటీ విశేషాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే ఎవరెవరి మీద ఎటువంటి వేటు పడాలన్నది ఎన్నో కోణాలనుంచి చూడాల్సివస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో విలీనమై అవిశ్వాస ఘడియల్లో దన్నుగా నిలిచిన ప్రజారాజ్యం పార్టీ నాయకులకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని ఆజాద్ ప్రకటించారు. చిరంజీవిని కాంగ్రస్ పార్టీలో అంతర్భాగమని పేర్కొంటూ, ఆయన, ఆయన పార్టీవారి సేవలను తప్పక వినియోగించుకుంటామని, చిరంజీవిని సీనియర్ నాయకుడి స్థాయిలో పరిగణిస్తామని అన్నారు. దానితో పాటే తెలంగాణా సమస్య మీద పరిష్కారానికి తగిన సమయం దగ్గరికొచ్చేసిందని కూడా ఆజాద్ ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more