Cabinet expansion will be solving telangana issueazad

Cabinet expansion will be solving Telangana issue: Azad.ghulam nabi azad, telangana, ys jagan, ysr congress, jagan camp mlas.

Cabinet expansion will be solving Telangana issue: Azad.ghulam nabi azad, telangana, ys jagan, ysr congress, jagan camp mlas.

Cabinet expansion.GIF

Posted: 12/10/2011 10:03 AM IST
Cabinet expansion will be solving telangana issueazad

Azadకిరణ్ ప్రభుత్వం పై పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. తనకు సంఖ్యా బలం లేకున్నా ఇతర పార్టీల బలం ఎంతో తెలుసుకోవడానికి ప్లాన్ వేసి సక్సెస్ అయ్యింది. ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన బలం నిరూపించుకొని కుర్చీని కదలకుండా చేసుకున్నాడు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన చిరు పార్టీ అండ్ టీమ్ అదను చూసి అలకపాన్పు వేసింది. మేం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే కొన్ని షరతులు ఉన్నాయని ఖరాఖండిగా చెప్పింది. దీంతో దిగొచ్చిన అధిష్టానం వాటికి ఒప్పుకుని అప్పటి వరకు పరిస్థితిని గట్టెక్కించింది. అధిష్టానం ఇచ్చిన ఆజ్ణతో చిరు శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఆ సంతోషాన్ని ఆస్వాదించక ముందే మళ్ళీ వారి ఆశల పై నీళ్ళు చల్లింది.

మంత్రివర్గంలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆశావహులకు, పీఆర్పీ నాయకులకు  మళ్లీ నిరాశ. తెలంగాణ అంశం తేలే వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌ పరోక్ష సంకేతాలివ్వడంతో పదవుల కోసం వేచిచూస్తున్న ఎమ్మెల్యేలకు మరోసారి నిరాశ తప్పలేదు.సంక్రాంతికి విస్తరణ ఉంటుందన్న ప్రచారం నిన్న, మొన్నటి వరకూ జరిగింది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుందన్న ప్రచారం జరిగింది. ఆ మేరకు మళ్లీ నేతల ఢిల్లీ యాత్ర లు మొదలయ్యాయి. అటు చిరంజీవి శిబిరంలోనూ ఆశలు చిగు రించాయి. మూడు, నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని ఆశించారు. తాజాగా ఆజాద్‌ ఢిల్లీలో చేసిన ప్రకటనతో కాంగ్రెస్‌-పీఆర్పీ ఎమ్మెల్యేలు డీలా పడ్డారు. తెలంగాణ అంశం తేలేవరకూ మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ నిరాశ అలుముకుంది. తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని, యుపీఏ భాగస్వామ్యపక్షాల అభిప్రాయ సేకరణ, రాష్ర్టంలో ప్రధాన పార్టీలతో అఖిలపక్షం వంటి ప్రక్రియ ఇప్పట్లో తేలేది కాదని, అందులోనూ కాంగ్రెస్‌ కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బిజీగా ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్రంపై దృష్టి సారించే అవకాశాలు లేవంటున్నారు. దీంతో పీఆర్పీ పరిస్థితి తన బాధను కక్కలేక మింగలేక సతమతమయ్యే పరిస్థితితో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Key discussions with azad
Vanga geeta complaint on mla shobha nagi reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles