One year jail of trs cheruku sudhakar

TRS,Telangana,Cheruku Sudhakar, TRS,Telangana,Cheruku Sudhakar, Jail, one year.

The travails of TRS politburo member Cheruku Sudhakar seem to be far from over.TRS,Telangana,Cheruku Sudhakar, Jail, one year,

One year jail of trs cheruku Sudhakar.GIF

Posted: 12/07/2011 09:53 AM IST
One year jail of trs cheruku sudhakar

Cheruku-sudhakarతెలంగాణ ఉద్యంలో చురుగ్గా పాల్గొన్న టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హింసకు పాల్పడ్డారని ఆయనను ‘జాతీయ భధ్రతా చట్టం’ కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇతను జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇతన్ని నాసా చట్టం కింద అరెస్టు చేయడం సరైందేనని, ఆయనను ఏడాది పాటు నిర్భందంలోనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే పలుసార్లు ఆయన ఇలాంటి చర్యలకు దిగారని కలెక్టర్ ఇచ్చిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. గతంలో ఇతని పై 18 కేసులు ఉన్నాయని కూడా పేర్కొంది. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం "చెరుకు సుధాకర్ సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు. ఆయనను ఏడాది పాటు నిర్బంధంలో ఉంచాలి'' అని సలహా కమిటీ పేర్కొంది. ప్రభుత్వానికి దీనిపై సూచనలు చేసింది.

గతంలో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న చెరుకు సుధాకర్ నక్సలైట్ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. బయటికి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో క్లినిక్ నడుపుతున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇటీవల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బస్సులపై దాడులు, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంతోపాటు ఆయనపై సుమారు 18 కేసులు నమోదవ్వడంతో ఇతన్ని ఏడాది పాటి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచాలని ఆదేశించింది. దీనిని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించి నేడు బంద్ లు రాస్తారోకోలకు పిలుపునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister kapil sibal snaps at social networks says code of conduct
Bjp mp siddu beats highway security guard  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles