తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రైతుల సమస్యలను తీర్చటంలో విఫలమయ్యారని, అవినీతికి పాల్పడ్డారని, ఆర్భాటంగా పైకి ప్రజలకు ఏదో చేస్తున్నట్టు చూపిస్తున్నా, మహిళలకు, విద్యార్థులకు, పేదలకు, వైద్యసేవలలోనూ పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయినందువలన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ, అవిశ్వాసతీర్మానానికి శాసన సభ్యుల ఓటింగ్ కోరిన అభ్యర్థనను సభాపతి నాదెండ్ల మనోహర్ స్వీకరించారు.
నిన్న శీతాకాలం సమావేశాల్లో ఆఖరి రోజు కావటంతో, అవిశ్వాస తీర్మాన అంశం రాజుకుంటూ ఉండటంతో అర్ధరాత్రి వరకూ సాగిన ఆవేశభరితమైన సమావేశంలో నిరసనలు, చణుకులు, విమర్శలు, ఎత్తిపొడుపుల మధ్య చర్చలు, వాదనలు, ప్రతివాదనలు జరిగి చివరకు సభలో ఓటింగ్ జరిగింది.
84 మంది తెదేపా సభ్యులకు 11 మంది తెరాస సభ్యులు, 19 మంది జగన్ మద్దతుదారులు, ఇద్దరు భాజపా సభ్యులు, నలుగురు సిపిఐ, ఒక సిపిఎమ్ సభ్యలు, స్వతంత్ర సభ్యుడు ఒకరు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసారు (లేచి నలబడ్డారు). అవిశ్వాసానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు 136 మంది, ప్రరాపా 17 మంది, ఎమ్ఐఎమ్ 6 గురు సభ్యులు, ఒకరు స్వతంత్ర సభ్యుడు మొత్తం 160 మంది కాంగ్రెస్ కి మద్దతు ప్రకటిస్తూ లేచి నిలబడ్డారు. 160 కి బదులుగా అవిశ్వాసాన్ని ప్రకటించిన 122 మంది అభీష్టం వీగిపోయింది.
ఒకవేళ ప్రరాపా కాంగ్రెస్ లో విలీనం కాకుండా ఉంటే బహుశా అవిశ్వాసం గెలిచుండేది. ఎందుకంటే కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ వేరు పార్టీని పెట్టి, ఎన్నికల్లో గెలిచిన 17 మంది ప్రరాపా సభ్యులు కచ్చితంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓటు వేసి ఉండేవారు. జగన్ వర్గం వారు కాక మిగిలిన కాంగ్రెస్ సభ్యులకు స్వతంత్రమే లేదు. నిన్నటి రోజున గైర్హాజరే కావొద్దని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, వారు అవిశ్వాసానికి మద్దతు పలికితే ఊరుకుంటారా. అంటే, తెలిసో తెలియకో ఒక పార్టీలో చేరినందువలన, కష్టమో నిష్టూరమో భరించాల్సిందేనన్నమాట. లేకపోతే అనర్హులవుతారు. ఒక వేళ అవిశ్వాస తీర్మానం గెలిచినట్లయితే పరవాలేదు కానీ వీగిపోయిన సందర్భంలో అటువంటివారి మీద వేటు పడుతుందన్న విషయం తెలుసు కాబట్టి, అటువంటివారి ఓటుని లెక్కలోకి తీసుకోవాలా అంటే తీసుకోవలసిందే.
ప్రశ్నాపత్రంలో తెలిసో తెలియకో సరైన జవాబు మీద టిక్ పెట్టినట్టయితే పాసవుతాడు కానీ ఫెయిల్ అని ఎలా అంటారు. అలా, సంఖ్యాబలం అవిశ్వాసాన్ని ప్రకటించిన సభ్యులను ఓడించినా, ప్రజాభిప్రాయమదే అని అనటానికి వీలు లేదు. కానీ ప్రజాభిప్రాయాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకోవలసిందే కానీ అందుకు మరో మార్గం లేదు.
అందువలన 282 మంది సభ్యలలో 122 మంది ప్రభుత్వం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించినా దానికి ఫలితం లేకపోయింది. ఇంతమందిని అంటే, అన్ని ప్రాంతాలవారిని సంతృప్తి పరచలేకపోయామే అనే బాధ పాలకవర్గంలో లేశమైనా కనిపించదు. ఓటింగ్ తర్వాత సభాపతి అంకెలను చదువుతుంటూనే కాంగ్రెస్ నాయకులు లేచి గబగబా వెళ్ళి ముఖ్యమంత్రికి కరచాలనం చేస్తూ అభినందనలు తెలియజేసారు. 3 ఎలాగూ 2 కంటే పెద్ద సంఖ్యే. 160, 122 కంటే ఎలాగూ పెద్దదే. అంకెలు ఎలాగూ గెలుస్తాయి కాబట్టి గెలిచాయి. దానికోసం అర్ధరాత్రి వరకూ చర్చలు, ఉత్కంఠ, వాదోపవాదాలతో, ప్రజలలో సద్భావన పెంచుకోవటం కోసం చేసిన ప్రయత్నమంతా కేవలం అర్థరహితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంకెలకు ఎలాగూ ఒక నిర్దుష్టమైన విలువుంది. 2 అంటే రెండే, మూడు అంటే మూడే కాబట్టి సభలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సభ్యలను లెక్కిస్తే విశ్వాసావిశ్వాసాల లెక్క ఇట్టే తేలిపోయేది.
అంకెలు గెలిచాయి! గెలిచినవారిలో మరొకరున్నారు- జనసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ! ఎవరిమీదా విశ్వాసం లేని ఆయన తటస్తంగా ఉండిపోయారు. ఆయన కూడా తన మనోభీష్టాన్ని ప్రకటించటంలో గెలుపొందారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more