దేవాలయాల పట్ల ప్రభుత్వ అలక్ష్యం ఎక్కువౌతోందని విమర్శలు ఎక్కువౌతున్నాయి. పురాతన శిథిలమౌతున్న దేవాలయాలను పట్టించుకునే నాథులైతే లేరు. కనీసం జనాదరణ కలిగిన, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సందర్శించే దేవాలయాల పట్లయినా శ్రద్ధ చూపించి, కూలిపోయిన గోపురాలను పునరుద్ధరించి మిగిలిన దేవాలయాలలోని గోపురాలను, కట్టడాలను పరిశీలించి వాటిని కాపాడే దిశగా ప్రభుత్వం పూనుకోవాలని పలువురు ఆశిస్తున్నారు. వరసగా గాలిగోపురాలు కూలిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా స్థబ్దుగా ఉన్న దేవాలయశాఖ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల మహానంది ఆలయంలో ధ్వజస్తంభం కూలిపోయినా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వెదురు బొంగుకి కూడా మూడేళ్లు నిండాయి. నవ నందులలో మిగిలిన నందీశ్వరాలయాల్లో కూడా ఇదే దుస్థితి పట్టబోతోంది. వినాయక నందీశ్వరుడి ఆలయంలోని ధ్వజస్తంభం కూడా శిథిలావస్తకు వచ్చి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోకపోవటం దురదృష్టమని, దేవాలయంలో ధ్వజస్తంభం లేకపోవటం అరిష్టమని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
దేవాలయ నిర్మాణంలో ప్రతిదానికీ ఒక ప్రాముఖ్యముంది. అది రాజగోపురమే కానీ, మిగిలిన గాలి గోపురాలే కానీ లేదా గర్భగుడి, దానిమీద కలశాలు, ప్రాకారాలు అన్నిటికీ విశిష్టత ఉంటుంది. అన్నీ కలిపితేనే దేవాలయమవుతుంది. దేవాలయ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగం. వీటి నిర్మాణం, నిర్వహణల బాధ్యతలను పూర్వకాలంలో పాలించే రాజులు చేపట్టేవారు. ఈనాటి పాలకులకు కొత్త నిర్మాణాల జోలికి పోకపోవటం వలనే భక్తులకు ఆలయాలు సరిపోకుండా ఉన్నాయి. నగరాలలోని రోడ్లను, రహదారులను విశాలంగా చేసే పని చేపట్టినట్టే, దేవాలాయ పునరుద్ధరణలు, కొత్త నిర్మాణాలు కూడా ప్రభుత్వ బాధ్యతే. ఆలయాల్లో ఆర్జన కూడా ఎక్కువవుతున్నా పట్టించుకోకపోవటం చాలా అన్యాయమని భక్తులు బాధపడుతున్నారు.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more