Rachabanda program in hyderabad ntr stadium

rachabanda program in hyderabad ntr stadium, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

rachabanda1-2.gif

Posted: 11/26/2011 10:35 AM IST
Rachabanda program in hyderabad ntr stadium

rachabanda     పట్నంలో కూడా రచ్చబండ పెట్టవచ్చు. పూర్వకాలంలో సమాచార వ్యవస్థ లేనప్పుడు ఊళ్ళోవాళ్ళంతా కలిసి ఊరి సమస్యలు చర్చించుకోవటానికి రచ్చబండ దగ్గర కూడేవారు. చర్చించుకునేదేమీ లేకపోతే వారికి తెలిసిన వార్తలను నలుగురిలో పంచుకునేవారు. ఏమీ లేకపోతే ఎల్లయ్య మీదో పుల్లయ్యమీదో ఏదో చెప్పుకోవటం చేసేవారు. పెద్ద తలకాయలు లేని సమయంలో కుర్రకారు పరాచికాలు సాగుతుండేవి. మరి ఇప్పుడు లెక్కలేనన్ని టివి ఛానెల్స్, ఇంటర్నెట్, సెల్ ఫోన్లు ఉన్న సమయంలో రచ్చబండ ఏమిటీ అంటే, అది ప్రభుత్వ కార్యకలాపం.

     ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు దగ్గరవటం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం చెప్పేదే ఉంటుంది కానీ వినేది ఉండదు. చెయ్యదలచుకున్నంత చేసి కార్యక్రమాన్ని ముగించటం ఉంటుంది. అధికారులను ఎవరైనా నిలదీసే ప్రయత్నం చేస్తే వారిని అదుపులోకి తీసుకోవటం జరుగుతుంది. గందరగోళం జరిగే సూచనలుంటే రచ్చబండను మధ్యలోనే నిలిపివేసే అవకాశం ఉంది.

     రచ్చబండ పార్లమెంటు కాదు ఎవరిష్టమొచ్చినట్టు వారు మాట్లాడటానికి, జరపదలచుకున్న చర్చలు, ప్రవేశపెట్టదలచుకున్న ప్రతిపాదనలను అడ్డుకోవటానికి, రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చేది పుచ్చుకోవాలి, చెప్పేది వినాలి అంతే. వేరే విషయాల ప్రస్తావనేమీ తేగూడదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాం, ఇంత మంది లబ్ధిదారులకు ఇన్ని కార్డులిచ్చాం అనే లెక్కలుంటాయి కాబట్టి వాటిని జయప్రదం చెయ్యటానికి ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుంది.

     ఈ రోజు హైద్రాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ జరిగే రచ్చబండ కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వటానికి స్టేడియం చుట్టుపక్కల రవాణా ఆంక్షలు, మిగిలిన దార్లలో దారి మళ్ళింపులు ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు కానివారు నగరంలోని వేరే దార్లలో వేరే పనుల మీద వెళ్ళేముందు ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి వెళ్ళవలసి ఉంది.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Classical telugu language studies only in ap
Major fire breaks out in mumbai crawford market areagif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles