Top maoist leader kishenji killed in encounter in west midnapore forests

Kishenji, encounter of Kishenji, Mallojula Koteswara rao, Maoist leader Kishenji, Suchitra Mahato, Jungalmahal encounter

Top Maoist leader Mr Kishenji, 58, was killed in an encounter by the special counter-insurgency police force of West Bengal today.

Top Maoist leader Kishenji killed in encounter.GIF

Posted: 11/25/2011 08:42 AM IST
Top maoist leader kishenji killed in encounter in west midnapore forests

kishanjiమావోయిస్టు పార్టీకి పెను దెబ్బ తగిలింది. మూడున్నర దశాబ్దాల పోరాటం ముగిసింది. మావోయిస్టు అగ్రనేత , పీపుల్స్ వార్ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరైన మల్లోజుల కిషన్ జీ (ఆలియాస్ కోటోశ్వరరావు) (58) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కిషన్ జీ హతమయ్యారు. బుధవారం నుండే చుట్టుముట్టిన కేంధ్ర, రాష్ట్ర భద్రతా బలగాలు కురిపించిన బాంబుల వర్షంలో కిషన్ హతమయ్యినట్లు ప్రకటించారు. మొదట తప్పించుకున్నారని తెలిపిన అసలు విషయాన్ని మాత్రం పోలీసులు నిన్న సాయత్రం బయటికి చెప్పారు. కిషన్‌జీతో పాటు సుచిత్రో మెహతా కూడా హతమైనట్లు వార్తలు.

తృణమూల్ కాంగ్రెసుతో దోస్తీ బెడిసికొట్టి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కత్తి కట్టిన నేపథ్యంలో కిషన్‌జీ కోసం విస్తృతంగా వేట ప్రారంభమైంది. కిషన్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

కేంద్రం విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో కిషన్‌జీ మూడో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర రావు రైతుకూలీ సంఘంలో ప్రధాన పాత్ర పోషించాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల జైత్ర యాత్రలో కూడా ఆయనది ప్రధానమైన పాత్ర. అప్పటి పీపుల్స్ వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లోజుల కోటేశ్వర రావు క్రమంగా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గత సిపిఎం ప్రభుత్వానికి పక్కలో బెల్లంగా వ్యవహరించాడు. ఇతని తల పై 19 లక్షల రివార్డు కూడా ఉంది. కిషన్ జీ మరణాన్ని ప్రజా సంఘాల నేతలు బూటకపు ఎన్కౌంటర్ గా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu has decided to file petition in high court
Janumaddi hanumachastri gets loknayak foundation award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles