Janumaddi hanumachastri gets loknayak foundation award

janumaddi hanumachastri gets loknayak foundation award

janumaddi hanumachastri gets loknayak foundation award

lokanayak-foundation.gif

Posted: 11/24/2011 05:59 PM IST
Janumaddi hanumachastri gets loknayak foundation award

yarlagadda-photoలోకనాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఈ సంవత్సరం కడప జిల్లాకి చెందిన జానుమద్ది హనుమచ్ఛాస్త్రి ఎంపికయ్యారు.  26 సాహితీ గ్రంథాలను రచించిన హనుమచ్ఛాస్త్రి సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని స్థాపించి విశాఖపట్నంలో వేమన మందిరానికి అప్పగించారు.  ఈ విషయాన్ని ప్రకటించిన లోకనాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఈ పురస్కారాన్ని విశాఖపట్నంలో, ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతుల సందర్భంగా జనవరి 18న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ చేతులమీదుగా బహూకరించబడుతుందని తెలియజేసారు.  పోయిన సంవత్సరం జనవరి 18న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారం 85 సంవత్సరాల వయస్కుడు కడప వెంకట సుబ్బన్న శతావధానికి అందించారు.   ఆ సందర్భంలో పురస్కారంలో భాగంగా లక్షా ఇరవైఐదు వేల రూపాయలకు చెక్కుని అందించిన డాల్ఫిన్ డయరీ అప్పారావు ఈ పురస్కారాన్ని తెలుగు ఙాన్ పీఠ్ గా అభివర్ణించారు. 

లోకనాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారాల్లో హనుమచ్ఛాస్త్రికి అందించబోయేది 8 వ వార్షిక పురస్కారం.  అంతకు ముందు వరుసగా, మాలతీ చందూర్, బోయి బీమన్న, వాసిరెడ్డి సీతాదేవి, కాళీపట్నం రామారావు, రావూరి భరద్వాజ, అవంత్స సోమసుందర్, కడప వెంకట సుబ్బన్న అందుకున్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top maoist leader kishenji killed in encounter in west midnapore forests
Prepaid auto service started at secunderabad railway station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles