తన తలను తాను నరుక్కున్నా అది రికార్డే అవుతుంది. చరిత్ర సృష్టించటానికో వింత పోకడను ఎన్నుకోవటం కంటే చేసే పనిలో ప్రావీణ్యాన్ని పెంచుకోవటం మంచిది కదూ. 11.11.2011 నాడు 11 గంటల సినిమా ఒకటి ప్రారంభమైంది. దాన్ని ఆ రోజు 11 గంటలకు, 11 కెమెరాలతో, 11 లొకేషన్స్ లో చిత్రీకరణ ప్రారంభించారట! ఇది శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకం మీద కేవలం రికార్డ్ సృష్టించే దిశగా ప్రారంభమైందట. సినిమాల్లో ప్రయోగాలు చేసినవారు లేకపోలేదు. కానీ అందులో కూడా ఒక పరమార్థం ఉండాలి కానీ కేవలం కొత్తదనం కోసమే చేస్తే అది చూడటానికి 11 మంది ప్రేక్షకులకంటే ఎక్కవుండరేమో అది కూడా ఆలోచించాలి.
యాదేఁ అనే హిందీ సినిమాలో సినిమా మొత్తానికి సునీల్ దత్ ఒక్కడే నటుడు. మన నాటకిల్లో ఏకపాత్రాభినయం లాంటిదే ఆ సినిమా. దాన్నెవరూ ఆదరించలేదు. ఎందుకంటే అందులో వినోదం కానీ, విఙానం కానీ, విమర్శ కానీ, సామాజక చైతన్యం కానీ అసలు ఏమీ లేకపోతే ఎవరూ హర్షించరు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడ్డవారు చప్పట్లు కొట్టటం తప్ప. మంచి కథతో సందేశాత్మకంగా అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సంయుక్తఁగా నిర్మించిన సుడిగుండాలు, మరోచరిత్ర సినిమాలే ఆదరణకు నోచుకోలేదు. కానీ వినోదభరితంగా కమల హాసన్, అమలతో తీసిన 'పుష్పక్' చిత్రంలో సంభాషణల్లేకుండా తీసినందుకు భారతదేశమంతా అన్ని భాషలవారూ చూసి ఆనందించగలిగారు. ప్రయోగాత్మక చిత్రాలంటే దాసరి నారాయణరావు, బాలచందర్, మణిరత్నం, బాల లాంటి దర్శకులు నిర్మించినవి, అలాగే ద్విపాత్రాబినయాలు, సోషల్ ఫాంటసీలు, బాలల చిత్రాలూ, రాజకీయాల మీద వ్యంగ్య చిత్రాలూ, ఇలా రకరకాల ప్రయోగాలు జరిగాయి కానీ, కేవలం సినిమా ప్రారంభించిన సమయం రికార్డ్ సృష్టిస్తుందంటే అందులో అటువంటిదేమీ లేదు. న్యూమరాలజీలో 11 సంఖ్యకి ఎటువంటి ప్రాధాన్యతా లేదు. తీసే పద్ధతిలో కొత్త పుంతలు తొక్కటం కాకుండా, సినిమా కథలో, కథనంలో, సందేశాన్నందివ్వటంలో, మనిషిని ఆలోచింపజేసే కథా వస్తువుతో చిత్ర నిర్మాణం చేస్తే, ప్రయోజనం ఉంటుంది.
ప్రయోగాలే చెయ్యాలంటే తెలుగులో ఎంతో సాహిత్యం ఉంది. తెలుగు కథలను తీసుకుని, తెలుగువారితో నటింపజేయవచ్చు. నటులకు కాకుండా పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ చిత్రాలు తీయవచ్చు. మనుషుల్లో జాతీయ సమైక్యతా భావన, సత్ప్రవర్తన వచ్చే విధంగా కథలను ఎన్నుకోవచ్చు. సమకాలీన సమస్యల మీద చిత్ర నిర్మాణం చెయ్యవచ్చు. ఆధ్యాత్మిక భావనలు పెరిగి నియమ నిబద్ధతలు పెరిగే దిశగా చిత్రాలు తీయవచ్చు. అంతేకానీ భయపెట్టేట్టుగా తీసాం, మామూలు కెమెరాతో నిర్మించాం, సహజ వెలుగుల్లో తీసాం, ఇన్నిరోజుల్లో తీసేసాం, అంత ఖర్చుతో తీసాం అనేదానికంటే ఏ ఉద్దేశ్యంతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నారన్నది ముఖ్యం. ఈ నేపథ్యంలో, ఫలానా టైంలో మొదలుపెట్టామనేదానికేమైనా అర్థం ఉందా? 11.11న మొదలుపెట్టినా, 12.12న మొదలుపెట్టినా ఒకటే కానీ సినీ నిర్మాణంలో స్పష్టత ఉండాలంతే!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more