The Biography of AP Komala Who Is A South Indian Playback Singer | Tollywood Gossips | Indian Playback Singers

Ap komala biography south indian playback singer

AP Komala biography, AP Komala life story, AP Komala history, AP Komala songs list, AP Komala wikipedia, AP Komala wiki telugu, AP Komala photos, AP Komala images, telugu playback singers, telugu singers, indian singers, tamil playback singers

AP Komala Biography South Indian Playback Singer : The Biography of AP Komala Who Is A South Indian Playback Singer. She has sung songs in Tamil, Malayalam, and Telugu languages.

మధురకంఠంతో ప్రేక్షకుల్ని మైమరిపించిన కో(కి)మల

Posted: 08/28/2015 04:46 PM IST
Ap komala biography south indian playback singer

చలన చిత్ర రంగంలో తమకంటూ సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న సింగర్స్ లో అర్కాట్ పార్థసారధి కోమల ఒకరు. దక్షిణభారత దేశపు నేపథ్యగాయని అయిన ఈమె.. 1950, 60 దశకాల్లో తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు. మూడేళ్లప్రాయంలోనే పాటలు పాడటం ప్రారంభించిన ఈమె.. తన మధురకంఠంతో చిత్రపరిశ్రమను మైమరపించింది. కోకిలలాంటి వినసొంపైనా గాత్రం కలిగిన ఈమెను తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదుతో సత్కరించింది.

జీవిత విశేషాలు :

1934 ఆగష్టు 28వ తేదీన మద్రాసులోని తిరువళ్ళికేనులో పార్థసారధి, లక్ష్మి దంపతులకు కోమల జన్మించారు. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం కల్పించారు. అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని పరవశించిపోయారు. ఆమె గాత్రానికి ఫిదా అయిన ఆయన.. ఆమెను తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి, అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. ఈమె తమిళురాలైనప్పటికీ తెలుగుదేశంలోనే సంగీతం నేర్చుకున్నారు.

శాస్త్రీయ సంగీతంలో పూర్తి శిక్షణ పొందిన అనంతరం కోమల తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో భాగంగా ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండి పతకం గెలుచుకున్నారు. సంగీత అవగాహన వుండటం వల్ల ఈమెకు 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తుండగా.. సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో కోమల తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆ తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఆనాడు ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నారు. కాలక్రమంలో ఈమె డిమాండ్ మరింత పెరిగిపోవడంతో పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే.. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం. ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Komala  Telugu Singers  Indian Playback Singers  

Other Articles