Durgabai deshmukh biography who established the women councils in chennai and andhra pradesh

durgabai deshmukh biography, durgabai deshmukh news, durgabai deshmukh life history, durgabai deshmukh wikipedia, durgabai deshmukh latest news, durgabai deshmukh photos, durgabai deshmukh history, durgabai deshmukh politics

durgabai deshmukh biography who established the women councils in chennai and andhra pradesh and also freedom fighter

ఆంధ్రమహిళా సభలను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధురాలు!

Posted: 09/27/2014 06:26 PM IST
Durgabai deshmukh biography who established the women councils in chennai and andhra pradesh

భారతదేశ స్వాతంత్ర్య పోరాటాల్లో పురుషులతోపాటు ఎందరో మహిళా ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చారు. బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాటాలు జరపడంలో తమవంతు కృషిని అందించారు. అంతేకాదు.. సమాజంలో మహిళలక్కూడా మగవారికి సమానంగా గౌరవమర్యాదలు కల్పించేలా కీలకపాత్రను పోషించారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ.. స్వేచ్ఛ బాటలో నడిపిన ఎందరో మహిళలు వున్నారు. వారిలో దుర్గాబాయి దేశ్ ముఖ్ కూడా ఒకరు! ఈమె ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు... ప్రత్యేక సామాజిక కార్యకర్త... పేరుపొందిన ప్రముఖ రచయిత్రి - న్యాయవాది కూడా! ముఖ్యంగా చెన్నై-హైదరాబాదులలో వున్న ఆంధ్రమహిళా సంభలను స్థాపించింది ఈవిడే!

వ్యక్తిగత జీవితం :

రాజమండ్రిలో నివాసమున్న రామారావు, కృష్ణ్ణవేణమ్మ దంపతులకు 1909వ సంవత్సరం జూలై 15వ తేదీన దుర్గాబాయి జన్మించారు. బాల్యం నుండే ప్రతిభాపాఠవాలను ప్రదర్శించిన ఈమె.. 10 సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యం సంపాదించింది.  హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. చిన్ననాటినుంచే స్వాతంత్ర్యపోరాటంలో పాలుపంచుకున్న ఈమె.. మహాత్మాగాంధీ రాకను పురస్కరించుకుని 13 ఏళ్ల వయస్సులోనే విరాళాలు సేకరించి, ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు తన చేతులకున్న బంగారు గాజులకు విరాళంగా ఇచ్చేసింది.

1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తున్న నేపథ్యంలో ఒకనాడు నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను సభలకు అనుమతించలేదు. దీంతో తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది.మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్య్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు. అనంతరం.. ఈమె అనేక మహిళా సంఘాలు, సాంఘీక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.

స్వాతంత్ర్యం తరువాత :

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన ఈమె... తర్వాత 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. ఆ సందర్భములోనే సి.డి.దేశ్‌ముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న చోటు చేసుకుంది. ఈవిడ 1953 ఆగష్టులో భారత ప్రభుత్వం ద్వారా నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగానూ పని చేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది. 1981 మే9వ తేదీన ఈమె తుది శ్వాసను విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles