Priyanka Arul Mohan in Captain Miller స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

Priyanka arul mohan to star alongside dhanush in captain miller

captain miller priyanka mohan, captain miller heroine, captain miller dhanush movie, captain miller cast, dhanush movies, Priyanka mohan upcoming movies, Captain Miller Movie, dhanush, Priyanka arul mohan, Nani, Gang Leader, period drama, Sathya Jyothi Films, Kollywood, Movies, Entertainment

Dhanush is currently working on Captain Miller, which features him in a new avatar. Now, here is some news for those looking forward to Captain Miller. Priyanka Mohan has formally joined its cast. Captain Miller is a period drama, backed by Sathya Jyothi Films.

స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

Posted: 09/21/2022 04:06 PM IST
Priyanka arul mohan to star alongside dhanush in captain miller

‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె మ‌రో స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌నుంది. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు. త‌మిళ న‌టుడు ధ‌నుష్‌. కోలీవుడ్‌కు స‌మానంగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధ‌నుష్‌. ‘త్రి’, ‘ర‌ఘువ‌ర‌న్ బి-టెక్’ వంటి సినిమాలో ఇక్క‌డ కూడా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌రుచుకున్నాడు.

ఇటీవ‌లే విడుద‌లైన ‘తిరు’తో వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన నానే వ‌రువెన్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇటీవ‌లే ధ‌నుష్ ‘కెప్టెన్ మిల్ల‌ర్’ అనే గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహ‌న్ ఎంపికైంది. ఈ చిత్రం ధ‌నుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles