Boyapati reveals secret hidden in Balakrishna film తాజా చిత్రంలో అదే పాత్రలో మెప్పించనున్న బాలయ్య: బోయపాటి

Boyapati reveals secret hidden in balakrishna film

Nandamuri Balakrishna, Aghora, Boyapati Srinu, Simha, Legend, Hatrick movie, media, Interview, Tollywood, movies, Entertainment

There have been rumors that Nandamuri Balakrishna will be seen playing the role of a Aghora in his ongoing film under the direction of Boyapati Srinu. Boyapati Srinu confirmed that Balakrishna will indeed be seen as an Aghora in his upcoming untitled directorial venture

తాజా చిత్రంలో అదే పాత్రలో మెప్పించనున్న బాలయ్య: బోయపాటి శ్రీను

Posted: 05/01/2020 09:21 PM IST
Boyapati reveals secret hidden in balakrishna film

టాలీవుడ్ పరిశ్రమలో హ్యాట్రిక్ చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల హ్యట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో టాలీవుడ్ లో వసూళ్ల పండగకు తెరలేపింది. ఇక తాజాగా నందమూరి నటసింహం బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో రానున్న తాజా చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి, వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాల బాక్సాఫీసు వద్ద దుమ్మురేపాయి.

దీంతో విరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రంపై ఇప్పటికే హైప్ కోనసాగుతోంది. ఈ కాంబినేషన్‌లో రానున్న తాజా చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనపడనున్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ తన మేక్ ఓవర్ ను మార్చుకుంటున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేకోవర్ లో భాగంగానే ఆయన తన హెయిర్ స్టైయిల్ కూడా మార్చుకున్నారని కూడా చిత్రపురిలో ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయాలపై తాజాగా బోయపాటి స్పష్టతనిచ్చారు.

బాలయ్య అఘోరాగా కనిపించనున్నారన్న వార్తల్లో నిజముందని బోయపాటి క్లారిటీ ఇచ్చారు, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. ఇటీవల ఓ సక్సెస్ మీట్ కు హాజరైన బోయపాటి..  బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని హామిఇచ్చారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  Aghora  Boyapati Srinu  Simha  Legend  Hatrick movie  Tollywood  

Other Articles