Rajinikanth 2.0 gets a new release date in China చైనాలో రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రభంజనం

Rajinikanth akshay kumar film 2 0 gets a new release date in china

2.0, rajinikanth, akshay kumar, 2.0 china release, 2.0 china, September 6, 2.0 september 6, 2.0 grand release in china, Tollywood, Bollywood, Entertainment, Movies

Rajinikanth and Akshay Kumar-starrer 2.0, directed by Shankar, was supposed to have a grand release in China in July. Billed as the costliest Indian movie ever made, the film promotes the message that the world is just for human beings..

చైనాలో రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రభంజనం

Posted: 08/14/2019 12:29 PM IST
Rajinikanth akshay kumar film 2 0 gets a new release date in china

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమాను ఆయన అభిమానులను రుచించలేదనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలకాగానే డివైడ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందడానికి కూడా చాలా కష్టించాల్సి వచ్చింది. అయితే రజనీ అభిమానులు తమిళనాడు తరువాత అంతటి పెద్ద సంఖ్యలో ఆయనకు అభిమానులున్నది మాత్రం చైనా అనే చెప్పాలి.

దీంతో ఆయన నటించిన రోబో 2.ఓ చిత్రాన్ని చైనా బాషలోకి తర్జుమా చేసిన చిత్ర నిర్మాణ వర్గాలు వచ్చే నెల 6వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో ఏముందు విశేషం అంటే.. సర్వసాధారణంగా భారత చిత్రాలు చైనాలోకి అనువాదం జరుగుతాయి కానీ ఇక్కడ విశేషమేమంటే.. రజనీ చిత్రం రోబో 2.ఓ మాత్రం చైనాలో రికార్డు స్థాయిలో విడుదల కానుంది. ఏకంగా 47,000 కంటే ఎక్కువగా త్రీడీ స్క్రీన్లపై రిలీజ్ అవుతుండడం గమనార్హం.

ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటివరకు మరొకటి లేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ, హెచ్ వై మీడియా సంస్థతో కలిసి 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది.  ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించగా, ఎంతో కీలకమైన ప్రతినాయక పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పోషించారు.  వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 12నే రిలీజ్ చేయాలని భావించినా, హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2.0  rajinikanth  akshay kumar  2.0 china release  2.0 china  2.0 september 6  Tollywood  

Other Articles