Heroine Anjali's Shocking New Slim Look అంజలి ఇలా మారి.. షాకిస్తుందేంటీ.?

Heroine anjali s shocking new slim look

Anjali, Anjali's shocking photos, Heroine Anjali, Anjali's New Slim Look, Anjali's Slim Look, Anjali Fitness, Anjali fitness freak, kollywood, tollywood, movies, entertainment

Heroine Anjali has been maintaining same look from her debut movie to her recent film, but the recent pictures of her came out as a shocker for the audience.

ముద్దుగుమ్మ అంజలి ఇలా మారి షాకిస్తుందేంటీ.?

Posted: 11/02/2018 07:59 PM IST
Heroine anjali s shocking new slim look

తెలుగు.. తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అంజలి.. ప్రేక్షకులకు షాకిస్తున్నారు. ఔనా అంటూ విస్మయానికి లోనవుతున్నారా.? అటు కాలీవుడ్ లో బిజీగా మారిపోయిన ఈ అమ్మడు.. కాసింత ఒళ్లు చేసింది. దాంతో అమెకు అనుకున్నంతగా హీరోయిన్ చాన్సులు రావడం లేదు. అయితే ఆ మధ్య కాసింత తగ్గిన అంజలి.. తన తగ్గదలకు శారీరిక వ్యాయామమే కారణమన్నట్లు.. జిమ్ లో అమె శ్రమిస్తున్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. అంతేకాదు వీడియోలను కూడా అన్ లైన్లో పోస్టు చేసింది.

కృషి వుంటే మనుషులు రుషులవుతారు అన్న నానుడి ఎంత నిజమో.. మరోమారు అంజలి రుజువు చేసిందని భావించారు అభిమానులు. తెలుగు అమ్మాయి అయినా ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించిన అంజలి.. ముందుగా తమిళంలో రాణించి, ఆ తరువాత తెలుగులో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ రెండు భాషల్లోనూ ఆమె విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించింది. కానీ ఇటీవలే ఆమెకి అవకాశాలు తగ్గాయి. బొద్దుగా ఉంటూనే యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన అంజలి, ఇప్పుడు బాగా సన్నబడిపోయింది.

తన ఫేస్ బుక్ లోను .. ట్విట్టర్ లోను ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు .. అంతగా అంజలి సన్నబడిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ ఫోటో చూసిన వాళ్లు అంజలి అంటే నమ్మరు. మరి ఏదైనా సినిమాలో పాత్ర కోసం ఆమె సన్నబడిందా? బొద్దుగా ఉండటం వల్లనే అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో బరువు తగ్గిందా? అనేది తెలియడం లేదు. ఈ ఫోటోలు చూసిన వాళ్లు మాత్రం అంజలి మరీ సన్నబడిపోయిందనీ, ఆమె బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్ చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heroine  anjali  slim look  fitness freak  actress  tamil movies  kollywood  tollywood  

Other Articles