Rangasthalam Reason for Sye Raa Delay | రంగస్థలం మూలంగానే ఈ కన్ఫ్యూజన్

Sye raa shooting delay

Sye Raa Narasimha Reddy, Chiranjeevi 151, Chiru 151, Konidela Productions Sye Raa, Sye Raa Regular Shooting Date, Sye Raa Rangasthalam

Mega Star Chiranjeevi Sye Raa Shooting delay due to Rangasthalam. No Updates for Regular Shooting Date and the Makers also not booked the lead actors dates.

సై రా షూటింగ్ డిలే నిజమేనా?

Posted: 11/09/2017 11:06 AM IST
Sye raa shooting delay

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఒపస్ సై రా నరసింహారెడ్డి ముహుర్తం మొదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా రెగ్యులర్ షూటింగ్ విషయంలో ఇంతవరకు స్పష్టత లేకుండా పోయింది. డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ అని చెప్పుకుంటున్నప్పటికీ.. అది కూడా పక్కా కాదనే సమాచారం ఇప్పుడు అందుతోంది.

ఈ విషయంపై టీం యూనిట్ మధ్యే స్పష్టత కొరవడింది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ ను ఫ్లాన్ చేసుకున్న దర్శకుడు, మేకర్లు అందుకు సంబంధించిన ప్రణాళికను చిత్ర యూనిట్ బృందానికి అందించకపోవటమే అందుకు కారణం. దీంతోపాటు ఇందులో తారాగణం డేట్లను కూడా ఇంత వరకు బుక్ చేసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సై రాకు రామ్ చరణ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రంగస్థలం బిజీలో ఉన్న అది పూర్తయ్యేదాకా తండ్రి సినిమా గురించి పట్టించుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఈ మధ్యే సమంతతో కలిసి కొత్త షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు కూడా. ఒకవేళ పనులు మొదలుపెట్టాలంటే రంగస్థలం షెడ్యూల్ త్వరగతిన పూర్తి చేయాలి. ఆ లెక్కన సై రా మరింత ఆలస్యం కావటం ఖాయంగా కనిపిస్తోంది. మరి చెర్రీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles