శాతకర్ణి ఆడియో చరిత్రలో నిలిచిపోనుందా? భారీ ఖర్చు.. వందడుగుల బల్బ్.. కొత్త సౌండ్ సిస్టమ్ | Lavish set up for Gautamaputra Satakarni Audio Launch.

A big fat audio launch for satakarni

Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Audio, Gautamiputra Satakarni Tirupati, Gautamiputra Satakarni launch event, Nandamuri Balakrishna Satakarni, Satakarni Audio, Satakarni Music Launch, Satakarni mania, Balayya Rally Satakarni Audio, Satakarni rally, Balakrishna 100th Movie

The music launch event of Nandamuri Balakrishna's upcoming most awaited drama 'Gautamiputra Satakarni' will take place on 26th December at Tirupathi at 7 pm. Digital invitation for Satakarni Audio Launch.

శాతకర్ణి ఆడియో కోసం భారీగా ఏర్పాట్లు

Posted: 12/26/2016 10:40 AM IST
A big fat audio launch for satakarni

సంచలనాలతో శాతకర్ణి మొదలు కాబోతుంది. తన కెరీర్ లో ప్రెస్టీజియస్ ఇప్పటికే బాలయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏర్పాట్లు దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అనధికార సమాచారం ప్రకారం కోటి రూపాయలతో ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

వంద అడుగుల ఎల్ఈడీ బల్బ్ ను స్టేడియంలో ఏర్పాటు చేయటం, 8 వేల ఖర్చుతో రూపొందించిన స్పెషల్ డిజిటల్ ఇన్విటేషన్ మేకర్లు ఆహ్వాన పత్రికలుగా పంపటం, దేశంలోనే ఫస్ట్ టైం ఓ కొత్త రకం సౌండ్ సిస్టమ్ ను ఆడియో వేడుకలో వాడటం... ఇలా చాలా రిచ్ గా ఏర్పాటు చేసేశారు. ఇది చాలదన్నట్లు తిరుపతిలో బాలకృష్ణ బసచేసే హోటల్ నుంచి 500 కార్లు, వెయ్యి బైకులతో భారీ ర్యాలీ ఉంటుందని, లక్ష మందితో 7 కిలోమీటర్లు సాగే ఈ ర్యాలీ సింహభాగంలో బాలకృష్ణ ఉంటారని అభిమాన సంఘాలు వెల్లడించాయి.

ఎంట్రీ పాసులను వీవీఐపీలకు మాత్రమే ఇస్తున్నామని, సాధారణ అభిమానులు ఎంతమందైనా హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించటంతో భారీగానే జనసందోహం హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు.

ఈ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుతో పాటు హేమమాలిని సహా, చిత్ర నటీనటులందరూ రానున్నారని తెలుస్తోంది. మొత్తానికి శాతకర్ణి ఆడియో వేడుకను టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం 6.30 నిమిషాలకు తిరుపతిలో ఆడియో వేడుక ఘనంగా జరగబోతుంది.

Bala Krishna on Horse as Satakarni

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  100th Movie  Gautamiputra Satakarni  Audio Launch  Tirupati  

Other Articles