Nithin Trivikram Crazy Combination Movie A AA Movie Muhurtham Held In Hyderabad | Ramanaidu Studio

Nithin trivikram samantha a aa movie starts ramanaidu studios

nithin a aa movie, trivikram a aa movie, samantha a aa movie, nithin samantha a aa movie, trivikram srinivas movie, nithin crazy projects, anupama parameshwaran, ramanaidu studios, hyderabad city

Nithin Trivikram Samantha A AA Movie Starts Ramanaidu Studios : Nithin, Trivikram And Samantha Crazy Combination Movie A AA Movie Muhurtham Held In Hyderabad

నితిన్-సమంతల ‘అ..ఆ..’ షురూ అయింది!

Posted: 09/24/2015 01:56 PM IST
Nithin trivikram samantha a aa movie starts ramanaidu studios

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి ‘అ..ఆ..’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే! ఈ సినిమా హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. హీరో నితిన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ముహూర్తానికి కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

తన ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసే దర్శకుడు త్రివిక్రమ్, ‘అ.. ఆ..’ సినిమాను కూడా ఓ ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఖరారు చేసిన ‘అ.. ఆ..’ అనే టైటిల్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన విషయంగా మారింది. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అన్న ట్యాగ్‌లైన్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా వుండబోతోందనే విషయంపై క్రేజ్ కనబడుతోంది. ఇక తన మాటలతో మంత్రం చేసే త్రివిక్రమ్.. ఈ సినిమాలోనూ ఫ్యామిలీ డైలాగులు భారీగానే పెట్టి వుంటాడని భావిస్తున్నారు. ఫ్యామిలీ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి.. కామెడీ కూడా భారీ రేంజులో వుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో నితిన్-సమంతల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్ష్కులను ఆకట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది. ఇక ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ ‘అ.. ఆ..’ అనే సినిమాతో త్రివిక్రమ్‌తో మూడో సారి జతకట్టడం విశేషంగా కనిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin samantha  trivikram a aa movie  anupama parameshwaran  

Other Articles