క్యారెట్ లో ఎన్నో ఔషధగుణాలు దాగి వుంటాయని నిపుణులు ఎన్నోసార్లు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ క్యారెట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్యారెట్ లో బీటా కెరోటీన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. ఇన్ని సుగుణాలు కలిగివున్న ఈ క్యారెట్ తో వివిధ రకాల రెమెడీలు చేసుకుని చర్మానికి పట్టిస్తే.. సౌందర్యం మీ సొంతం.
* ఒక పాత్ర తీసుకుని అందులో నాలుగు స్పూన్ల క్యారెట్ గుజ్జు వేయాలి. ఆ తర్వాత అందులో రెండు స్పూన్లు బొప్పాయి గుజ్జు, కొద్దిగా పాలూ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మిళమిళ మెరిసే ముఖ సౌందర్యం మీ సొంతం.
* రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో సగం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద మూడతలు మాయమవుతాయి.
* రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్కా వేసి బాగా కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు మాయమవడమే కాక ముఖ తేజస్సు మెరుగుపడుతుంది.
* ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more