నల్లగా నిగనిగలాడే సాఫ్ట్ జుట్టు పొందాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. కొందరికి పుట్టుకతోనే ఆ అదృష్టం లభిస్తే.. మరికొందరు మాత్రం లభించదు. పైగా.. ఈ ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన జుట్టు పొందాలంటే కష్టమే. ఎందుకంటే.. కాలుష్య వాతావరణ ప్రభావం వల్ల జుట్టు ఆరోగ్యం మరింత క్షీణించిపోతుంది. దీంతో జుట్టు సంబంధిత సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లు ఆ సమస్యల నుంచి ఉపశమనం పొంది.. సాఫ్ట్ జుట్టును పొందాలనుకుంటే అందుకు అనుగుణంగా కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే.. ఆరోగ్యకరమైన సాఫ్ట్ జుట్టు మీ సొంతం. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* ఒక పాత్ర తీసుకుని అందులో గుడ్డును పగలకొట్టి బాగా గిలక్కొట్టుకోవాలి. అందులో పాలు లేదా నిమ్మరసం లేదా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. కొద్దిసేపటివరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ఆయిలీ జుట్టు దూరమవుతుంది.
* పాలు.. ఇది జుట్టుకు ఒక ఉత్తమ ప్రోటీన్. జుట్టుకు కావాల్సిన ఆరోగ్యకరమైన పోషకాలు పాలలో పుష్కలంగా వుంటాయి. ఈ పాలను స్నానం చేసుకోవడానికి ముందు జుట్టుకు బాగా పట్టించి.. కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. ఈ పాలు జుట్టుకు ఓ మంచి హెయిర్ కు కండీషనర్ గా పనిచేస్తుంది.
* ఒక పాత్రలో అరటిపండ్లతో గుజ్జు తయారుచేసుకోవాలి. దీనిని నేరుగా జుట్టుకు పట్టించుకోవచ్చు. కానీ.. ఇందులో గుడ్డు మిక్స్ చేస్తే ఇంకా మంచిది. ఆ అరటి గుజ్జులో కొద్దిగా గుడ్డు మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవాలి. 20నిముషాల తర్వాత హెయిర్ వాష్ లేదా తలస్నానం చేసుకుంటే.. ఫలితం గమనించవచ్చు.
* ఏదైనా ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో కొద్దిగా పెసరపిండి, మెంతిపొడి, ఒక గుడ్డు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. ఓ గంటపాలు అలాగే ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు సమస్యలన్నీ తగ్గుతాయి.
* నిమ్మరసం.. దీనిని రకరకాల హెయిర్ ప్యాక్స్ లో జోడించి తలకు పట్టించుకోవచ్చు. నిమ్మరసాన్ని గుడ్డు, నూనె, పాలు లేదా తేనెలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిముషాల వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. మిగతావాటికంటే.. ఇది ఉత్తమ ఫలితం అందిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more