వయస్సు పెరుగుతున్నకొద్దీ ఆరోగ్యపరంగా మార్పులు వస్తుంటాయి కాబట్టి.. జుట్టుసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. జుట్టు పల్చబడడం, పొడిబారిపోవడం, కాలక్రమంలో జుట్టు రాలిపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, ప్రోటీన్ లోపం, వాతావరణ కాలుష్యం, ఇతర సాధారణ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...
* కొబ్బరి నూనె : ఒక పాత్రలో కొబ్బరి నూనె (4 టేబుల్ స్పూన్స్), నిమ్మ రసం (2 టీస్పూన్లు) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత జుట్టును మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు శుభ్రంగా మారడంతోపాటు పెరుగుదలకు సహాయపడుతుంది.
* అలోవెరా : ముందుగా తాజాగా వుండే అలొవెరా (కలబంద) జెల్ తలమీద వేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత బాదం నూనె కొన్ని చుక్కల తలమీద వేసుకుని మసాజ్ చేసుకోవాలి. 30 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. జుట్టు సమస్యలు తగ్గి, పెరుగుదల మెరుగవుతుంది.
* ఆముదం : ఒక పాత్రలో 1 టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆముదము వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు తగిలించి కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసిన కాసేపు తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తే.. జుట్టు రాలిపోవడం తగ్గి, పెరుగుదల మెరుగవుతుంది.
* ఆలివ్ ఆయిల్ : ఆలివ్ నూనెతో జుట్టుకు పట్టించి.. 10 నిముషాల వరకు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసిన 8 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడుసార్లు చేస్తే.. జుట్టులో వుండే మలినం పూర్తిగా తొలగించబడుతుంది. అలాగే.. జుట్టు నిర్మాణ అభివృద్ధి మెరుగవుతుంది.
* ఉల్లిపాయ : ఒక పాత్రలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కాస్త తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. కొద్దిసేపటివరకు మర్దన చేసుకోవాలి. తరువాత అది పూర్తిగా ఆరిన అనంతరం తలస్నానం చేయాలి. ఇలా 2 వారాలపాటు రోజు మార్చి రోజూ చేస్తే.. ఎన్నో ఫలితాలు పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more