జగన్ ను ఆదుకుంటాడా లేక ఆడుకుంటాడా? | will Jagan gets moral support from Modi.

Jagan keeps option open on bjp alliance

YS Jagan, Jagan BJP, BJP YSRCP, Jagan Meet Modi, Jagan Modi Appointment, Modi Moral Support YS Jagan, Pawan BJP YS Jagan, Jagan TDP BJP, Jagan BJP Congress

YSRCP Chief YS Jagan trying to forge alliance with BJP and try to get moral support from PM Modi.

జగన్-బీజేపీ దోస్తీ సెట్ అయ్యేనా?

Posted: 04/11/2017 10:05 AM IST
Jagan keeps option open on bjp alliance

ఓవైపు పార్టీ ఫిరాయింపులు, వరుస ఓటములు, మరోవైపు అక్రమాస్తుల కేసును మళ్లీ సీబీఐ తవ్వటం వెరసి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దానికి తోడు ప్రజా సమస్యలపై బలంగా తన వాణి వినిపిస్తున్నా.. చివరకు ఫిరాయింపులను నిరసిస్తూ హస్తిన వెళ్లి పెద్దలకు సేవ్ డెమొక్రసీ పేరుతో చర్యలు తీసుకోవాలని కోరినా ప్రయోజం లేకుండా పోయింది. బలమైన ప్రతిపక్ష నేతగా మెప్పించలేకపోతున్న జగన్ కి ఇప్పుడు సీబీఐ జోరు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరి ఈ సమయంలో ఆయన్ను ఆదుకునేది ఎవరు?

రాజకీయ లబ్ధి కోసం జగన్ ఇప్పుడు బీజేపీ పంచన చేరనున్నాడనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అంతేకాదు తనని ఆదుకునే వ్యక్తి ఒక్క ప్రధాని మోదీయే నన్న భావనకు వచ్చిన ఆయన ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మేలు జరగటంతోపాటు కేసులో విచారణ కూడా నెమ్మదించే అవకాశం ఉందన్న అభిప్రాయంలో ఉన్నాడంట. ఇప్పటికే కాంగ్రెస్ అప్రకటిత మద్ధతు ఉండనే ఉంది.

ఈ పరిస్థితులకు తోడు తొలినాళ్లలో బీజేపీతో స్నేహ హస్తం అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ ఆ పార్టీపై విరుచుకుపడుతుండటం, దక్షిణాదిలో పాగా అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలతో మిత్రపక్షాల మధ్య కూడా వైరం తలెత్తే అవకాశం, వీటన్నింటిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న జగన్ బీజేపీకి దగ్గరయ్యేందుకు తరచూ ఢిల్లీ టూర్లు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనలో బిజీగా ఉన్న మోదీ త్వరలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  PM Modi  Appointment  

Other Articles