China has ramped up troops deployment, infra along LAC సరిహద్దులో గ్రామాలను నిర్మిస్తున్న చైనా: ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్

Marginal increase in chinese patrolling in eastern sector across lac army commander

Arunachal Pradesh,India-China border in Arunachal Pradesh,Arunachal border conflict,India-China standoff,China increases activity in eastern sector of Arunachal Pradesh,China increases activity along Arunachal border,India military modernisation,Eastern Army Commander,Lt Gen Manoj Pande,17 Mountain Corp,Line of Actual Control,LAC,Easter Ladakh,Ladakh standoff,Galwan valley,India-China military commander level talks,border area surveillance,drone surveillance

There has been a marginal increase in Chinese patrols in the eastern sector along the Line of Actual Control (LAC), while the scale and durations of its exercises in their depth areas since the stand-off in eastern Ladakh last year, said Eastern Army Commander Lt. Gen. Manoj Pande on Tuesday.

సరిహద్దులో గ్రామాలను నిర్మిస్తున్న చైనా: ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్

Posted: 10/19/2021 08:24 PM IST
Marginal increase in chinese patrolling in eastern sector across lac army commander

వాస్త‌వాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా ఆర్మీ గ్రామాల‌ను నిర్మిస్తున్న‌ట్లు భార‌త ఆర్మీ పేర్కొన్న‌ది. ఈస్ట్ర‌న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే దీనిపై ఇవాళ కొన్ని అంశాలు వెల్ల‌డించారు. ఎల్ఏసీ వెంబ‌డి ఉన్న కీల‌క, స‌మ‌స్యాత్మ‌క‌ ప్ర‌దేశాల్లో చైనా ఆర్మీ త‌న కార్య‌క‌లాపాల‌ను పెంచిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ ప్రాంతాల్లో వార్షిక సైనిక చ‌ర్య‌ల‌ను పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ చేప‌డుతోంద‌ని, కీల‌క ప్ర‌దేశాల్లో కార్య‌క‌లాపాల ఉదృతి పెరిగింద‌ని, శిక్ష‌ణ పొందుతున్న ప్ర‌దేశాల్లో ఇంకా పీఎల్ఏ ద‌ళాలు ఉన్నాయ‌ని, అందువ‌ల్లే వాస్త‌వాధీన రేఖ‌తో పాటు డెప్త్ ఏరియాల్లో నిఘాను పెంచిన‌ట్లు లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ పాండే తెలిపారు.

రెండు దేశాల‌కు చెందిన ద‌ళాలు.. వాస్త‌వాధీన రేఖ వెంట మౌళిక‌స‌దుపాయాలను పెంచుకుంటున్న‌ట్లు ఈస్ట్ర‌న్ ఆర్మీ క‌మాండ‌ర్ వెల్ల‌డించారు. పీఎల్ఏ వ్యూహాత్మ‌క మోడ‌ల్ ప్ర‌కారం.. బోర్డ‌ర్ వెంట వాళ్లు గ్రామాల‌ను నిర్మిస్తున్నార‌ని, అయితే అది ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌ని, ఈ విష‌యాన్ని త‌మ ప్ర‌ణాళిక‌ల్లోకి తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. స‌రిహ‌ద్దుల్లో ర‌క్ష‌ణ ద‌ళాల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్ర‌తి సెక్టార్‌లో కావాల్సినంత ద‌ళాలను ఏర్పాటు చేస్తున్న‌ట్లు జ‌న‌ర‌ల్ పాండే చెప్పారు. వీలైనంత‌వ‌ర‌కు టెక్నాల‌జీని పెంపొందించేందుకు ఆర్మీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఈస్ట్ర‌న్ ఆర్మీ క‌మాండ‌ర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles