Priyanka Gandhi Says 40% Poll Candidates Will Be Women యూపీ ఎన్నికలు: తొలి హామీని ప్రకటించిన ప్రియాంక గాంధీ

Priyanka gandhi announces 40 percent congress tickets to women in uttar pradesh polls

Priyanka Gandhi vadra, Priyanka Gandhi up election, congress up election, congress up election women, Priyanka Gandhi, congress, women empowerment, LPG cylinder, 40% seats, up election news, uttar pradesh assembly election, Yogi Adityanath, Akilesh Yadav, Mayawati, SP, BSP, Uttar Pradesh, Politics

Congress leader Priyanka Gandhi Vadra, in-charge of the state affairs, announced 40 per cent party tickets to women in the assembly election likely to be held in the spring next year. Priyanka Gandhi said, “The Congress will give 40 per cent tickets to women in the Uttar Pradesh Assembly election The decision was taken with consensus. Had it been left to me, I would have given 50 per cent party tickets to women in the polls.”

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: తొలి హామీని ప్రకటించిన ప్రియాంక గాంధీ

Posted: 10/19/2021 07:21 PM IST
Priyanka gandhi announces 40 percent congress tickets to women in uttar pradesh polls

వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌రుగ‌నున్న ఉత్త‌రప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలి హామీని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంక గాంధీ. తన పార్టీ నుంచి ఎన్నికల తొలి హామి మేరకు గెలిచిన తరువాత కాకుండా గెలుచే ప్రయత్నంలోనే మహిళలను బాగం చేయడమని అమె ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మ‌హిళ‌ల‌కు 40 శాతం టికెట్లు కేటాయించాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించిందని అని ప్రియాంక గాంధీ వాద్రా మీడియాకు వెల్లడించారు. మహిళ స్వాలంభనను అధికారం అందించే విషయం నుంచే తమ పార్టీ పునికి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు.

మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రావాల‌ని కాంగ్రెస్ పార్టీ మనస్పూర్తిగా కోరుకుంటుందని, అధికారంలో వారు పూర్తిస్థాయి భాగ‌స్వాములు కావాల‌ని ఆశిస్తున్నామ‌ని ప్రియాంకాగాంధీ చెప్పారు. పరోక్షంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే సహా రాష్ట్రంలోని అధికార బీజేపి పార్టీలను టార్గెట్ చేసిన ప్రియాంక మహిళ స్వాలంభన అంటే కొన్ని పార్టీలు కేవలం ఉజ్వల పథకం కింద ఎల్సీజీ గ్యాస్ సిలిండర్లను అందించడమని భావిస్తున్నారని చురకలు అంటించారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఆరు కోట్ల 61 లక్షల మంది మహిళా ఓటర్లను ప్రియాంక అకర్షించే ప్రయత్నం చేశారు.

ల‌క్నోలో మీడియాతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ.. ‘‘నేను ఇవాళ మా మొద‌టి హామీ గురించి మాట్లాడ‌బోతున్నా. వ‌చ్చే ఏడాది యూపీలో జ‌రుగ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు 40 శాతం టికెట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించాం’’ అని చెప్పారు. ఈ నిర్ణయాన్ని తాము మహిళల ఉజ్వల భ‌విష్య‌త్తు కోసమే తీసుకున్నామని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తనకే వదిలేసి వుండివుంటే.. నిర్ణయం మరోలా ఉండేదన్నారు. పార్టీ కాబట్టి 40 శాతం టికెట్లను మహిళలకు కేటాయించేందుకు అంగీకరించిందని, తానే ఈ నిర్ణయం తీసుకుని ఉండివుంటే.. 40 శాతానికి బదులు మహిళలకు 50 శాతం అందించేలా నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు. మ‌హిళ‌లంతా రాజకీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles