ప్రముఖ దక్షిణాది నటుడు కమలహాసన్ సోదరుడు, నిర్మాత చంద్రహాసన్ లండన్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ప్రస్తుతం లండన్ లో కుమార్తె అను వద్ద నివాసం ఉంటున్న ఆయన.. ఇవాళ ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. జనవరి 7న చంద్రహాసన్ భార్య గీతామణి (73) మరణించినప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆయన మూడు నెలలు గడవక ముందే మరణించడంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కమలహాసన్ తో కూడా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటనతో తెరపై కనిపించి ప్రేక్షకుల మనన్నలను పోందినా.. తాను మాత్రం తెర వెనుక వుంటూ పనిచేయడానికే ఆయన అసక్తిని కనబర్చారు. ఆయన మృతికి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more