ముస్లిం మహిళలు బీజేపికి ఎందుకు ఓటేశారో తెలుసా..? Triple talaq-hit women voted for BJP in UP says Ravi Shankar Prasad

Triple talaq hit women voted for bjp in up says ravi shankar prasad

ravi shankar prasad, law minister, opposition, congress, triple talaq, congress, BSP, samajwadi party, silence, mayawati, dimple yadav, priyanka gandhi, national news

Union Law and Justice Minister Ravi Shankar Prasad questioned opposition leaders over their “silence” on triple talaq and said it was “not an issue of religion, but of gender justice, gender equality and gender dignity”.

ముస్లిం మహిళలు బీజేపికి ఎందుకు ఓటేశారో తెలుసా..?

Posted: 03/19/2017 10:43 AM IST
Triple talaq hit women voted for bjp in up says ravi shankar prasad

ముస్లిం మహిళలు తమకు భారీ సంఖ్యలో ఓటు వేయడంతోనే ఉత్తర్ ప్రదేశ్ లో తమ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ముస్లిం మహిళలను తమవైపుకు అకర్షించింది ట్రిపుల్‌ తలాక్ రద్దు అంశమేనని అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై ఉత్తర్ ప్రదేశ్ లోని విపక్షాలను ఆయన తూర్పారబట్టారు. ముస్లిం మహిళలు ఎదర్కొంటున్న ఈ సమస్యపట్ల మాయావతి, డింపిల్ యాదవ్ సహా ప్రియాంకా గాంధీలు ఎందుకు మౌనంగా వున్నారని ఆయన ప్రశ్నించారు.

ట్రిపుల్‌ తలాక్‌ సమస్య ముస్లిం మహిళలు తీవ్రమైన కష్టనష్టాలకు గురిచేసిందన్నారు. అందవల్లే వారు బీజేపికి ఓటు వేశారన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ కేవలం మత సంబంధమైన అంశం కాదనీ, అది న్యాయం, సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని రవిశంకర్‌ స్పష్టం చేశారు. మహిళల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20కి పైగా ఇస్లామిక్‌ దేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌కు సవరణలు చేయడమో, నిషేధించడమో చేశారన్నారు.

అయోధ్యలోని రాజ్యాంగబద్ధంగా రామ మందిరాన్ని కట్టితీరుతామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని ప్రసాద్‌ వ్యక్తం చేశారు. ఇందుకోసం బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందించినట్లు తెలిపారు. తాము బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో యూపీ తరహాలో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందని రవిశంకర్ ప్రసాద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi shankar prasad  law minister  opposition  congress  triple talaq  congress  BSP  samajwadi party  

Other Articles