అర్కే నగర్ లో అల్లుడు.. కోడలు రసవత్తర పోటీ Jaya's RK Nagar Seat to Witness Two Electoral Debuts in a 4-way Contest

Jaya s rk nagar seat to witness two electoral debuts in a 4 way contest

Amma Deepa Peravai, deepa jayakumar, Dinakaran, AIADMK candidate, RK Nagar bypoll, palnisamy, paneer selvam, tamil nadu, sasikala, jayalalithaa, Jayalalithaa niece, Amma Deepa Peravai, Deepa jayakumar, palnisamy, paneer selvam, DMK, mk stalin, tamil nadu politics

Battlelines have been drawn for next month’s bypoll in RK Nagar Assembly constituency which fell vacant following Jayalalithaa’s demise in December.

అర్కే నగర్ లో కోడలు.. అల్లుడికీ మధ్య రసవత్తర పోటీ

Posted: 03/15/2017 05:36 PM IST
Jaya s rk nagar seat to witness two electoral debuts in a 4 way contest

తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన అన్నాడీఎంకే అధినేత్రి.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. సొంత నియోజకవర్గం అర్కేనగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికల నగరా మ్రోగడంతో.. అక్కడి నుంచి గెలిచి పార్టీని తమ అధిపత్యంలోకి తీసుకోవాలని ఒకరు, అమ్మకు నిజమైన వారసురాలు తానేనని నిరూపించుకునేందుకు మరోకరు పోటీపడతుండటంతో అసక్తికరంగా మారింది. వీరికి తోడు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకోవాలని భారీ వ్యూహాలకు తెరలేపుతున్నాయి. దీంతో అర్కేనగర్ ఉప ఎన్నికపై ఉత్కంఠ కూడా పెరుగుతోంది.

అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. జయలలిత ఆస్తులతో పాటు రాజకీయానికి కూడా అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి  ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు ఇప్పటికే దీపా జయకుమార్ తెలిపారు.

గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. ఇక మరో జాతీయ పార్టీ బీజేపి కూడా అర్కేనగర్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నధమైతున్నట్లు సమాచారం. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles