మాయావతి బాటలోనే కేజ్రీవాల్.. ఫలితాలపై సందేహాలు Arvind Kejriwal rakes up 'EVM tampering' again

Kejriwal alleges foul play in evms says 20 25 aap votes transferred to akalis

mayawati, EVM Tampering, EVM ringing, Assembly elections results, supreme court, re-elections, Aravind kejriwal, punjab ssembly elections results, Uttar Pradesh elections, UP elections 2017, BJP, Congress, AAP bahujan samajwadi party, politics

Alleging foul play in functioning of Electronic Voting Machines (EVMs) during the recently-concluded state elections, AAP chief Arvind Kejriwal said Election Commission (EC) should review elections results.

మాయావతి బాటలోనే కేజ్రీవాల్.. ఫలితాలపై సందేహాలు

Posted: 03/15/2017 04:23 PM IST
Kejriwal alleges foul play in evms says 20 25 aap votes transferred to akalis

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అంచనాలను, గెలుపోటములను తలకిందులు చేస్తూ.. బీజేపి దూసుకురావడం.. అటు పంజాబ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుని, మరో రెండు రాష్ట్రాల్లో కొద్దిలో అధికారాన్ని చేజార్చుకున్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సర్వేలకు అందకుండా అంచనాలను మించి బీజేపి అధికారంలోకి రావడం పట్ల ఇప్పటికే అనుమానాలను వ్యక్తం చేసిన బీఎస్సీ అధినేత్రి మాయావతి బాటలోనే నడిచేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొగ్గుచూపుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ మినహా రమారామి అన్ని రాష్ట్రాలలో గెలుపోందిన పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తరువాత మాయావతి న్యాయపోరాటానికి తెరతీస్తుండగా, అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ ఎన్నికలలో ఈవీఎం ట్యాపరింగ్ పై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అకాలీదళ్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆప్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు తప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధిస్తుందనుకున్న తమ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయని, అకాలీదళ్‌ కు మాత్రం 31 శాతం ఓట్లు రావడం వచ్చాయని.. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. తమ ఓట్లు అకాలీదళ్‌ కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.

ఈవీఏంల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. వీవీపీఏటీ స్లిప్పులతో ఈవీఏంలోని ఫలితాలను పోల్చి చూస్తే గణాంకాలు సరిగా ఉన్నాయో, లేదో తెలుస్తుందన్నారు. ఈవీఏంల ట్యాంపరింగ్ కు అవకాశముందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఏంల వినియోగంపై పునరాలోచన చేస్తున్నాయని చెప్పారు. గోవాలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles