శశికళకే గతి లేదంటే.. అతనికి అంత సీనా.. ఛస్ | EC rejects TTV Dinakaran's response on Sasikala's appointment.

Ec rejects aiadmk replies signed by dinakaran

Tamil Nadu Election Commission, Sasikala Natarajan, Sasikala Dinakaran, TVV Dinakaran EC, EC Sasikala, Sasikala Natarajan, AIADMK chief EC, AIADMK Deputy General Secretary Dinakaran, Notices to Dinakaran, Dinakaran Shock, Sasikala EC Shock, AIADMK Election Commission, Sasikala Appointment EC

Tamil Nadu Election Commission refuses to accept Dinakaran's response on Sasikala being made AIADMK chief.

చిన్నమ్మ ఆత్మకి కూడా పెద్ద దెబ్బే పడింది

Posted: 03/04/2017 11:33 AM IST
Ec rejects aiadmk replies signed by dinakaran

జైల్లో ఉన్న శశికళ నటరాజన్ కు ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ పార్టీ ఉపప్రధాన కార్యదర్శి పదవికీ అనర్హుడంటూ తేల్చి చెప్పింది. శశికళ ఏ విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అర్హురాలో తెలియజేయాలంటూ ఈసీ పంపిన ఫాంలపై అన్నాడీఎంకే పార్టీ తరపున దినకరన్ సంతకం చేయటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

తొలుత అసలు దినకరన్ అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి ఎలా అర్హుడో వివరణ ఇవ్వాలంటూ జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశించగా, దినకరన్ బదులు ఇచ్చుకున్నాడు. అయితే పార్టీ రూల్స్ ప్రకారం దినకరన్ ఎంపిక చెల్లదంటూ, ఆ పదవికి అనర్హుడు అని స్పష్టం చేసింది. దినకరన్ అసలు ఆఫీస్ బేరర్ కాదని, అలాంటప్పుడు శశికళను ఎంపిక ఎలా చేశాడని, పైగా ఇప్పుడు ఈసీ పంపిన ఫాంలపై సంతకాలు ఎలా చేస్తాడంటూ ఓ లేఖలో ప్రశ్నించింది.

నిజానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలంటే ఐదేళ్ల పార్టీ సభ్యత్వం ఉండాలని పన్నీర్ సెల్వం వర్గం మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ప్రాథమిక సభ్యులు కూడా అందుకు మద్ధతు తెలపాల్సి ఉంటుంది. కానీ, శశికళ విషయంలో ఇవేం జరగకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేయటంపై మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణాలనే చూపుతూ ఆమె నియామకం చెల్లదంటూ ఈసీకి ఫిర్యాదు కూడా అందింది.

తాను అరెస్టయిన పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సడలకూడదని బావించిన శశికళ పార్టీ పగ్గాలను మేనల్లుడు, వీరవిధేయుడు అయిన దినకరన్ కు అప్పగించింది. త్వరలోనే అతనిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి జైలు నుంచే అధికారం చెలాయిద్దామన్న ఫ్లాన్ లో కూడా ఉందని టాక్. ఇంతలోనే దినకరన్ నియామకం చెల్లదన్న షాక్ తగలటంతో శశికళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Commission  Sasikala Natarajan  AIADMK General Secretary  Dinakaran  Notices  

Other Articles