సీఎం పళనికి కొత్త తలనొప్పి.. అమ్మ ఇక పూర్తిగా మాయం | Madras High Court sends notice to Tamil Nadu Chief Minister.

New tension in tamil nadu politics after madras hc notices to palaniswamy

Palaniswami Trust Vote, Madras High Court, Stalin HC, HC Notice to Palaniswamy, Jayalalithaa Portraits, AIADMK New Problem, Madras High Court Tamil Nadu Government, Palaniswamy Government, Tamil Nadu Politics, CM Palaniswamy Notices

Madras High Court on Stalin’s plea against Tamil Nadu CM Palaniswami’s trust vote. Sends notice to Tamil Nadu Chief Minister. In another petition madras HC ordered to remove Jayalalithaa portraits from government offices.

తమిళ రాజకీయాల్లో మళ్లీ కొత్త టెన్షన్

Posted: 02/27/2017 05:26 PM IST
New tension in tamil nadu politics after madras hc notices to palaniswamy

చల్లబడ్డాయనుకున్న తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పిబ్రవరి 18న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే వేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. కొత్త సీఎం పళనిస్వామితో పాటు ఆ రాష్ట్ర హోం శాఖకు, అసెంబ్లీ సెక్రెటరీకి సోమవారం నోటీసులు జారీ చేసింది.

శాసనసభ నుంచి విపక్షం మొత్తాన్ని బయటకు పంపి, బలపరీక్ష నిర్వహించారంటూ ఐదు రోజుల కింద డీఎంకే నేత స్టాలిన్ ఈ పిటిషన్ వేశారు. అంతేగాకుండా బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలను నిర్బంధించి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఒత్తిడి చేశారని అందులో హైకోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

మరోపక్క కేసులో శశికళ అండ్ కో నిందితులుగా తేలటంతో జయలలిత ఫోటోలను ప్రభుత్వ పథకాల నుంచి తొలగించాల్సిందిగా దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. తక్షణమే వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు పథకాల చివర ఉన్న అమ్మ పేరును కూడా మార్చాల్సిందిగా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Madras High Court  Stalin Petition  CM Palaniswamy  Notices  

Other Articles