హైదరాబాద్ లో చంద్రబాబుకి ఇంకా ఏం పని? | Chandrababu meet governor narasimhan

Chandrababu meet governor narasimhan

Chandrababu Naidu Sudden appointment with Governor Narasimhan, CM Chandrababu Naidu Governor Narasimhan, Governor Narasimhan Chandrababu Naidu, Babu Cabinet reshuffle

AP CM Chandrababu Naidu Sudden appointment with Governor Narasimhan.

హైదరాబాద్ లో చంద్రబాబుకి ఇంకా ఏం పని?

Posted: 09/12/2016 09:26 AM IST
Chandrababu meet governor narasimhan

మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు శనివారమే ముగిసినప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా భాగ్యనగరంలోనే ఉన్నాడు. వినాయకచవితి, ఆపై వర్షాకాల సమావేశాలతో వారం బిజీగా గడిపిన బాబు ఆపై ఆదివారం సెలవుదినం కావటంతో కాస్త విశ్రాంతి తీసుకుని సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధం అయ్యాడు. కానీ, ఇంతలో సడన్ గా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ తో భేటీ కావటంపై చర్చ మొదలైంది.

ఉదయం 9.30 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ కొనసాగిన తీరు, వైకాపా శాసనసభ్యుల ఉన్మాదపు చర్యలు, ఓటుకు కోట్లు మళ్లీ తెరపైకి రావడం తదితరాల గురించి వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇక పనిలో పనిగా మంత్రివర్గ విస్తరణపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుందని సమాచారం.

ఇటీవలి కాలంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ కు మంత్రి పదవి కట్టబెట్టనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గవర్నర్ తో భేటీ అనంతరం బెజవాడ చేరుకుని ఆయన సోమ, మంగళవారాల్లో అక్కడే ఉండి, బుధవారం ఆయన విశాఖ పర్యటనకు బయలుదేరతారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  CM Chandra Babu Naidu  Governor  Narasimhan  

Other Articles