Asaram missing woman appears before police

self-styled godman Asaram Bapu, Asaram bapu, Missing Woman in Asaram Case, Missing Woman appear before police, Missing Woman accusces of rape, Missing Woman appear before surat police, Missing Woman appear after two weeks, Missing Woman visits Kamrej police station,

A 33-year-old married woman, who has accused self-styled godman Asaram Bapu of rape and who mysteriously disappeared from her house two weeks ago, today appeared before the Surat police.

అసారాంబాపు కేసులో పోలీసు ముందుకోచ్చిన ‘అదృశ్య’ మహిళ

Posted: 12/29/2014 06:32 PM IST
Asaram missing woman appears before police

వివాదాస్పద ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు కేసులో అదృశ్యమైన మహిళ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆసారాం బాబు అరెస్టు కేసులో కీలక సాక్షిగా మారిన ఈ వివాహిత అదృశ్యం కావడంతో పోలీసులే ఖంగుతిన్నారు. సుమారు రెండు వారాలుగా వివాహిత మహిళ ఆదృశ్యం కావడంపై పలు కథనాలు, అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహిళ సూరత్ లోని కామ్ రాజ్ పోలిస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడి పోలీసులతో పలు విషయాలపై అదృశ్య చర్చించినట్లు సూరత్ జిల్లా పోలీసు సూపరింటెండ్ ప్రదీప్ సిజుల్ తెలిపారు.

అసారాం బాపు అరెస్టు తరువాత మహిళ అహ్మదాబాద్ లోని సూరత్ నివాసం నుంచి రెండు వారాల కింద్రట అదృశ్యమై.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చేరుకుంది. అయితే అశారం కేసులో ప్రధాన పిర్యాదుదారుగా వుండటం చేత ఆమెకు పోలీసులు రక్షణ కల్పించారు. పోలీసు రక్షణ తన సామాజిక జీవనానికి ప్రతిబంధకంగా మారిందని అమె పేర్కొంది. తన స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ తనకు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని అడుగటం, తనను ఇబ్బంది పెట్టిలా పరిణమించిందని తెలిపారు. తన పిల్లలు కూడా పాఠశాలలో ఇదే విషయమై పలు ప్రశ్నలను ఎదుర్కోన్నారని పేర్కొన్నారు.

దీంతోనే తాము బంధువుల కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈ నెల 14న ఇండోర్ కు వెళ్లామని చెప్పారు. ఈ కారణంగానే తమ నివాసాన్ని మార్చాల్సి వచ్చిందని, తాము మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు వెళ్లామని తెలిపారు. అయితే ఈ నెల 18 వారు అదృశ్యమైనట్లు, బాధితురాలి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా, అశారాం బాపు కేసులో తాను మొదట ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వివాహిత మహిళ పెట్టనుకున్న పిటీషన్ ను న్యాయస్థానం ఈ నెల 22న తిరస్కరించింది.

అశారాం బాపు కేసులో ప్రధాన పిర్యాదుదారుగా వున్న మహిళ అంతకు ముందు తమపై ఆశారాం బాబు పలు సార్లు లైంగికంగా వేధించాడని పిర్యాదుచేశారు. తాను ఆశారాం బాపు ఆశ్రమంలో వున్న సమయంలో 1997 నుంచి 2006 వరకు అనేక పర్యాయాలు ఆశారాం బాపు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.  అదే సమయంలో అమె చెల్లి కూడా ఆశారాంబాపు కుమారుడు నారాయణ సాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో కదిలిన పోలీసులు తండ్రి కోడుకులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Missing Woman  surat police  asaram bapu  

Other Articles