A cyclonic storm is currently brewing in bay of bengal

tropical storm, bay of bengal, least temperature in india, cyclone storm in bay of bengal

Tropical Storm developed in Bay of Bengal whether conditions are very critical

బంగాళా ఖాతంలో అల్పపీడనం... ఇప్పటికే చలి.., ఆపై వర్షమట!!

Posted: 12/29/2014 06:02 PM IST
A cyclonic storm is currently brewing in bay of bengal

దేశం మొత్తం చలి పంజా ధాటికి బిక్కు బిక్కు మంటుంది  ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కనిష్ట స్థాయి కంటే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. చలి ధాటికి చాలా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ చలి కి తోడు ఇప్పుడు బంగాళా ఖాతం లో అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుభందంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో, శ్రీలంక, తమిళనాడు లపై అల్పపీడన ప్రభావం పడనుంది.  దక్షిణ కోస్తా పైన కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉండచొని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నైరుతి బంగాల ఖాతం లో ఏర్పడిన ఈ అల్ప పీడనం తో, రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తా లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలిపింది. ఏది ఏమైనా ఇప్పటికి చలి ధాటికి విలవిల్లాడుతున్న ప్రజలు ఈ అల్ప  పీడన ప్రభావంతో ఆందోళన చెందుతున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tropical storm  bay of bengal  India Weather  

Other Articles