The Biography Of Manjula Who Was An Indian Actress | Telugu Top Celebrites | Bollywood Stars

Manjula biography indian actress telugu celebrities bollywood stars

Manjula biography, Manjula life story, Manjula wikipedia, Manjula telugu wikipedia, Manjula life history, Manjula updates, Manjula photos, Manjula news, Manjula movies, Manjula filmography

Manjula Biography Indian Actress Telugu Celebrities Bollywood stars : The Biography Of Manjula Who Was South Indian Actress. She acted in more than 100 films in South Indian languages like Tamil, Telugu, Kannada and Malayalam.

వెండితెరపై మెరుపుతీగలా మెరిసిన మంజుల

Posted: 09/11/2015 06:26 PM IST
Manjula biography indian actress telugu celebrities bollywood stars

చలనచిత్రరంగంలో ఎందరో నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరు మాత్రం అందరి హృదయాల్లో చిరకాలంగా నిలిచిపోతారు. అటువంటి తారల్లో మంజుల ఒకరు. మేనిమెరుపు ఛాయవంటి సౌందర్యాన్ని కలిగిన ఈమె.. చాలాకాలం పాటు వెండితెరపై మెరుపుతీగలా మెరిశారు. తన మొదటి చిత్రం నుంచే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అందంతో ఎందరో అభిమానుల్ని తనవైపుకు మరలించుకున్నారు. ఈమె కాలంలో ఎందరో తారలు వచ్చినప్పటికీ.. ఈమె స్థానం మాత్రం వారందరికంటే ప్రత్యేకంగా వుండేది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆరోజుల్లో ఈమె మాయాజాలం ఇండస్ట్రీపై ఎలా ప్రదర్శించేదో!

జీవిత చరిత్ర :

1953 సెప్టెంబర్ 9వ తేదీన చెన్నైలో జన్మించారు. 1965లో ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. ఆ తరువాత ఎంజీఆర్ నటించిన ‘రిక్షాకారన్’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తరువాత ‘ఉలగం సుట్రుం వాలిబన్’ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తమిళనాటలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం తదితర పరిశ్రమల నుంచి ఈమెకు అవకాశాలొచ్చాయి. తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించినా.. ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ‘మాయదారి మల్లిగాడు’ చిత్రం. ఆ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అందమైన చిరునవ్వు, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానం సంపాదిచుకుంది.

తెలుగులో తొలిసారిగా మంజుల నటించిన చిత్రం ‘జైజవాన్’(1970). ఏయన్నార్, భారతి జంటగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. హీరోయిన్ గా ఆమె నటించిన తొలిచిత్రం ‘వాడే వీడు’. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్ తో జతకట్టింది. ఆ తర్వాత ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్ సరసన ఈమె ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక కృష్ణ కెరీర్‌లో శిఖరాగ్రాన నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’లోను ఈమె నటించింది. అయితే కృష్ణ సరసన కాకుండా చంద్రమోహన్ పక్కన గిరిజన యువతి రత్తి పాత్రను ఆమె పోషించారు. తెలుగులో ఎంతోమంది హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించినా.. శోభన్‌బాబు, మంజుల జంట మాత్రమే హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘మంచి మనుషులు’ చిత్రంలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత వీరి జంటలో వచ్చిన ఇతర సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించడంతో.. వీరిద్దరికి ‘హిట్ పెయిర్’గా పేరొచ్చింది. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులతో ఆమె నటించింది. గిన్నిస్ రికార్డు చిత్రం ‘స్వయంవరం’లోను ఆమె నటించారు.

1970ల్లో మంజుల హీరోయిన్‌గా అగ్రస్థాయికి చేరుకుంది. అయితే 80వ దశకంలో ఇతర హీరోయిన్లు హవా కొనసాగడంతో ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో ఆమె వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. విజయకుమార్‌తో పెళ్లి జరిగిన తరువాత ఈమె సినిమాలకు దూరమయ్యారు. వీరి ముగ్గురు అమ్మాయిలు. చివరి రోజుల్లో ఆమె తీవ్ర అనారోగ్య బారిన పడింది. ఓ రోజు ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి కింద పడిన మంజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చెన్నైలోని రామచంద్ర మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ఆరోగ్య పరిస్థితి క్షీణించి 2013 జూలై 23న తుదిశ్వాస విడిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjula Life History  Telugu Top Celebrites  

Other Articles