The Extroardinary Women In India Who Creates History | Mother Teressa | Indira Gandhi

Women who create history in india

Extroardinary women, historical women, strong women, strong indian women, mother teressa, kiran bedo, kamaladevi chatopadhya, fathima bibi

women who create history in india : The Strong Women In India Who Create History

మహిళలకు ఆదర్శంగా నిలిచిన ప్రతిభావంతులు

Posted: 09/02/2015 05:39 PM IST
Women who create history in india

మదర్ థెరిసా : 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయ పౌరురాలుగా తన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వెదజల్లారు. దేశంలో వున్న పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు తనవంతు సహాయంగా ఆశ్రమాలను నిర్మించింది. ఛారిటీల పేరుతో దేశం నలుమూలల వున్న పేదప్రజలకు పరిచర్యలు చేశారు. 1980లో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కూడా పొందారు.

కిరణ్ బేడి : దేశంలో గర్వించదగ్గ మహిళల్లో ఈమె ఒకరు. 1972లో తొలి మహిళా ఐపీఎస్ గా ఎంపిక అయి, నిబద్ధతతో తన పనిని నిర్వర్తించింది. పోలీసు శాఖలో అనేక పదవులు, సంస్కరణనలను చేపట్టినందుకుగాను మెగసెసె అవార్డుతో ఇంకా పలు అవార్డులు ఈమెకు వరించాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ.. 2007వ సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

కమలాదేవీ ఛటోపాధ్యాయ : గృహకుటీర పరిశ్రమల సముద్ధరణకోసం విశ్రాంతి లేకుండా సేవలు అందించినందుకు భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. 1966లో కమ్యూనిటీ లీడర్ షిప్ విభాగంలో ‘రామస్ మెగసెసె’ అవార్డును పొందిన తొలిమహిళగా రికార్డు సృష్టించింది. అలాగే.. శాంతినికేతన్ నుంచి ‘దేశికోత్తమ’ సత్కారాన్ని కూడా అందుకున్నారు.

ఇందిరాగాంధీ : 1966లో దేశ తొలిమహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయి చరిత్ర సృష్టించారు. జవహర్ లాల్ నెహ్రూ కూతురయిన ఈమె.. ఆయన ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా సెక్రటరీగా పనిచేశారు. అలాగే లాల్ బహుదూర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.

కమల్ జిత్ సంధు : 1970లో దేశం తరఫు నుంచి ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న ఈమె ఏకంగా గోల్డ్ మెడల్ నే సంపాదించి రికార్డుపుటలకెక్కారు. 400 మీటర్ల గల దూరాన్ని కేవలం 57.2 సెకండ్లలోనే పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నారు.

ఫాతిమా బివి : కేరళ రాష్ట్రానికి చెందిన ఒక న్యాయమూర్తి. 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా ఖ్యాతిని గడించి, చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యున్నత స్థానం పొందిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తరువాత కొన్నాళ్లపాటు తమిళనాడు గవర్నరుగా కూడా తన సేవలను అందించారు.

ప్రియా జింగాన్ : 1992లో ఇండియన్ ఆర్మీలో చేరిన తొలి మహిళ క్యాడెట్ గా రికార్డు సృష్టించింది. ఆనాటి వరకు ఆర్మీలోకి రావడానికి మగవారే భయపడుతున్న తరుణంలో... ఈమె రంగప్రవేశం చేసి మహిళలలో స్ఫూర్తిని పెంపొందించింది.

బచేంద్రిపాల్ : 1984వ సంవత్సరంలో అత్యంత ఎత్తయిన ఎవరస్టు శిఖరాన్ని అవరోధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. తల్లిదండ్రులు, బంధువుల సహాయంతో ఎంఎబిఎడ్ ను పూర్తి చేయగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : strong women  indian historical women  

Other Articles