The Biography Of Bangalore Nagarathnamma Who is Famous Indian Carnatic singer, cultural activist, scholar and courtesan

Bangalore nagarathnamma biography indian carnatic singer cultural activist scholar courtesan

Bangalore Nagarathnamma history, Bangalore Nagarathnamma biography, Bangalore Nagarathnamma life story, Bangalore Nagarathnamma journey, indian feminists, indian famous women

Bangalore Nagarathnamma Biography Indian Carnatic singer cultural activist scholar courtesan : Bangalore Nagarathnamma was an Indian Carnatic singer, cultural activist, scholar, and courtesan. A descendant of courtesans, she was also a patron of the arts and a historian.

అంతరించిపోతున్న దేశ కళలకు ఎనలేని సేవ చేసి మహా వనిత

Posted: 05/20/2015 06:07 PM IST
Bangalore nagarathnamma biography indian carnatic singer cultural activist scholar courtesan

నాట్యం, సంగీతం.. ఈ రెండూ దేశ కళలకు పెట్టింది పేరు! ఒకప్పుడు ఎంతో గౌరవంగా భావించే ఈ కళలు.. కాలక్రమంలో వాటి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో అవి అంతరించిపోయాయేమోనన్న అనుమానం కలగక మానలేదు. అలాంటి సమయంలో వీటి విశిష్టత గురించి చాటిచెబుతూ.. అంతరించిపోతున్న ఆ కళలకు ఎనలేని సేవ చేసిన వనితలు ఎందరో పుట్టుకొచ్చారు. అలాంటివారిలో బెంగుళూరు నాగరత్నమ్మ ఒకరు.

జీవిత చరిత్ర :

1878 నవంబరు 3వ తేదీన మైసూరు దగ్గరలోని నంజనగూడు అనే చిన్న గ్రామంలో పుట్టలక్ష్మమ్మ, సుబ్బారావు దంపతులకు ఈమె జన్మించింది. ఈమె ఒకటిన్నర సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు తండ్రి సుబ్బారావు తల్లీబిడ్డలను వదిలివెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టానష్టాలను ఓర్చి, కూతురిని పెంచింది. దీంతో నాగరత్నమ్మ బాల్యము తల్లిప్రేమలో ఒడుదుడుకులు లేకుండా గడిచింది. ఈమె గిరిభట్ట తమ్మయ్య అనే గురువు వద్ద సంస్కృతం, వివిధ కళలు నేర్చుకుంది. ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష కన్నడం అయినప్పటికీ..  తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలను అవలీలగా మాట్లాడేది.

పుట్టలక్ష్మమ్మ తన కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిందేకు మద్రాసు చేరింది. ఈ క్రమంలోనే మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు బెంగళూరు చేరింది. అక్కడ మునిస్వామప్ప అను వాయులీన్ విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతం నేర్పుటకు అంగీకరించాడు. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసం, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలం నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. ఈ విధంగా తన కూతురు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడంతో పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. అయితే.. దురదృష్ఠవశాత్తు నాగరత్నమ్మ 14వ ఏటలో తల్లి మరణించింది.

రంగ ప్రవేశము : 1892లో మైసూరు మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో నాగరత్నమ్మ చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. అనతికాలంలోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదుర్చుకుంది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి.

సంగీత సేవ : కర్ణాటక సంగీతంలో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొంది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసికుని, హృదయాల్లో హత్తుకొనేటట్లు పాడగలిగేది. ఆమె గళంలో స్త్రీ కంఠంలోని మాధుర్యంతోపాటు పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమై వినసొంపుగా ఉండేది.

మరణం : నాగరత్నమ్మ మే 19, 1952న ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతే దహన సంస్కారాలు జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Nagarathnamma  Indian Women  

Other Articles